Sharad Pawar meets PM Modi: దేశ రాజకీయాల్లో గత కొన్నిరోజుల నుంచి ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఎన్సీపీ అధినేత, ఎంపీ శరద్ పవార్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసానికి వెళ్లి శరద్ పవార్ కలిశారు. వీరిద్దరి మధ్య దాదాపు 50 నిమిషాల వరకూ భేటీ కొనసాగినట్లు సమాచారం. ఈమేరకు పవార్ మోదీ సమావేశానికి సంబంధించిన ఫొటోను ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్ చేసింది. కాగా.. భారత రాష్ట్రపతి రేసులో తాను లేనని శరద్ పవార్ పేర్కొన్న అనంతరం.. ప్రధాని మోదీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ఏర్పడితే.. ఆ కూటమి కాంగ్రెస్ ఉండాలని శరద్ పవార్ కొన్ని రోజుల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే. అనంతరం పవార్‌తో రాజకీయ వ్యూహకర్త రెండుసార్లు భేటీ కావడం.. ఆ తర్వాత రాహుల్‌తో సమావేశమవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. వచ్చే ఏడాది జరిగే రాష్ట్రపతి ఎన్నికలో బరిలో శరద్ పవార్ ఉంటారని.. ఆయనకు దేశవ్యాప్తంగా మద్దతును కూడగట్టేందుకు ప్రశాంత్ కిశోర్ ప్రయత్నిస్తున్నారనే ఊహగానాలు మొదలయ్యాయి. ఇది కాస్త పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో.. తాను రాష్ట్రపతి పదవికి పోటీ చేయబోనని పవార్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మోదీతో పవార్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి మహాఅఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత పవార్.. మోదీ భేటీ మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంపై ఎంతమేరకు ప్రభావం చూపబోతోందనే విషయం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read: