PM Modi: కష్టసుఖాల్లో మొదట కాల్‌ చేసేది ఎవరికో చెప్పిన మోదీ.. తొలి పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర విషయాలు

|

Jan 11, 2025 | 9:28 AM

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. జెరోధా అధినేత నిఖిల్ కామత్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోదీ.. ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన బాల్యం, ఇంట్లో కష్టాలు, రాజకీయాల్లో ఎదురైన సవాళ్ల గురించి వెల్లడించారు. అలాగే కష్టసుఖాల సమయంలో ఎవరికి కాల్‌ చేస్తారని నిఖిల్‌ కామత్‌ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు మోదీ..

PM Modi: కష్టసుఖాల్లో మొదట కాల్‌ చేసేది ఎవరికో చెప్పిన మోదీ.. తొలి పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర విషయాలు
Follow us on

ప్రధాన నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్‌లోని లాల్ చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించేందుకు శ్రీనగర్‌కు వెళ్లిన సందర్భంగా జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంటూ, కష్టాల సమయంలో తాను ఎవరికి ఫోన్ చేస్తానని మోదీ తన మొట్టమొదటి పోడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. ఆపద సమయంలో ఎవరికి ఫోన్ చేస్తారని భారతీయ పారిశ్రామికవేత్త, పెట్టుబడిదారుడు నిఖిల్ కామత్ అడిగిన ప్రశ్నకు ప్రతిస్పందిస్తూ, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడానికి శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌కు వెళ్లినప్పుడు దాడికి సంబంధించిన ఓ ఘటనను ప్రధాని మోదీ పంచుకున్నారు.

పంజాబ్‌లోని ఫగ్వారాలో జరిగిన దాడిలో కొంత మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు… దేశం మొత్తం కష్టాల్లో ఉంది.. ఆ సమయంలో లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం అంత సులభం కాదు.. వారు జెండాను కాల్చేవారు. ప్రధాని మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత, తాను చేసిన మొదటి కాల్ తన తల్లికి అని చెప్పారు. ఎందుకంటే తాను అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం తనకు సంతోషకరమైన క్షణమని, ఆ సమయంలో తన తల్లి ఆందోళన చెందుతుందని, అలాంటి సమయంలో తన తల్లికి కాల్ చేసి మాట్లాడానని వెల్లడించారు. తల్లితో మాట్లాడటం ఎంతో అనుభూతినిచ్చిందన్నారు. ఒత్తిడి ఉన్న సమయంలో తల్లికి కాల్‌ చేసేవాడినని తెలిపారు.

“నా తల్లికి 100 సంవత్సరాలు నిండినప్పుడు, నేను ఆమె ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లాను. ఆమె చదువుకోలేదు.. నేను ఉద్యోగానికి బయలుదేరాలి అని నేను ఆమెకు చెప్పినప్పుడు, ఆమె స్పందించింది కామ్ కరో బుద్ధి సే, జీవన్ జియో శుద్ధి సే (జ్ఞానంతో పని చేయండి, స్వచ్ఛతతో జీవించండి)”. అని చెప్పాని మోదీ తల్లి మాటలను గుర్తు చేసుకున్నారు.

చదువుకోని తన తల్లి ఎప్పుడూ బడికి వెళ్ళని చెప్పడం నాకు పెద్ద సంతోషకరమైనదని, భగవంతుడు ఆమెకు ఏమి ఇచ్చాడో నాకు తెలియదు.. ఆమెతో మరికొంత సమయం గడిపి ఉంటే నేను ఇంకా చాలా నేర్చుకునేవాడిని అని నేను గ్రహించాను అని ప్రధాన మంత్రి అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి