PM Modi: వైబ్రెంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. పలు కంపెనీల ప్రతినిధులతో ప్రధాని మోదీ భేటీ..

వైబ్రెంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. గుజరాత్ గాంధీనగర్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైబ్రెంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ను గుజరాత్‌ ప్రభుత్వం నిర్వహించడం ఇది 10వ సారి. మోదీ సీఎంగా ఉన్న సమయంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

PM Modi: వైబ్రెంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. పలు కంపెనీల ప్రతినిధులతో ప్రధాని మోదీ భేటీ..
Pm Modi

Updated on: Jan 10, 2024 | 4:10 PM

వైబ్రెంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. గుజరాత్ గాంధీనగర్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైబ్రెంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ను గుజరాత్‌ ప్రభుత్వం నిర్వహించడం ఇది 10వ సారి. మోదీ సీఎంగా ఉన్న సమయంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వస్తువులను ప్రదర్శించారు.

34 దేశాలకు చెందిన ప్రతినిధులు, 16 సంస్థలకు చెందిన ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ట్రేడ్‌షోను ప్రతినిధులతో కలిసి ఆసక్తిగా తిలకించారు మోదీ. స్టాళ్లను పరిశీలిస్తూ.. ప్రధాని మోదీ వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. వివిధ సంస్థల సీఈవోలతో పాటు ప్రతినిధులతో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పెట్టుబడులు తదితర అంశాలపై మాట్లాడారు. పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉన్నట్లు ఆయా కంపెనీల ప్రతినిధులు తెలిపారు.

ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ కూడా ఈ గ్లోబల్‌ సమ్మిట్‌లో తన ఉత్పత్తులను ప్రదర్శించింది.

కాగా.. గాంధీనగర్‌లో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ స్మారక నాణెం, స్టాంపును విడుదల చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..