PM Modi in UP: కీలకమైన అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు విపక్షాల ఆలోచనా తీరు కారణంగా దశాబ్ధాలుగా అడ్డంకులు ఏర్పడ్డాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్‌లో ప్రతిష్టాత్మక సరయూ కెనాల్ జాతీయ ప్రాజెక్ట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 14 లక్షల హెక్టార్లలోని భూములకు సాగునీరు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా యూపీలోని 29 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దాదాపు రూ.9,800 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందిబెన్ పాటిల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విపక్షాలపై ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు విపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయంటూ ఆరోపించారు.
కాగా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సీడీఎస్ బిపిన్ రావత్‌తో పాటు జవాన్లకు ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఘననివాళి అర్పించారు. ఈ ఘటనతో దేశమంతా విషాదంలో మునిగిపోయిన విషయం వాస్తవమేనని , వీటిని తట్టుకుని నిలబడే శక్తి భారత్‌కు ఉందన్నారు. ప్రమాదంలో గాయపడ్డ కెప్టెన్ వరుణ్‌సింగ్ ప్రాణాలను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. జనరల్ బిపిన్ రావత్ మృతి దేశానికి తీరని లోటు అన్నారు. కాని ఇలాంటి కష్టసమయాల్లోనే భారత్ మరింత శక్తివంతంగా తయారవుతుందని.. అభివృద్ది ఆగదన్నారు. జీవితమంతా భారత సైన్యాన్ని శక్తివంతం చేయడానికే జనరల్ బిపిన్ రావత్ పనిచేశారని ప్రశంసించారు.
Speaking at the launch of the Saryu Nahar National Project. Watch. https://t.co/d0tNpdM8kk
— Narendra Modi (@narendramodi) December 11, 2021
త్వరలో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి – మార్చి మాసాల్లో యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Also Read..
Chandrababu Naidu: ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్.. రాజీనామా చేద్దామంటూ YSRCPకి చంద్రబాబు ఛాలెంజ్