PM Narendra Modi: ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన.. నెట్టింట వైరల్ అవుతున్న మోదీ చిత్రాలు

|

Jan 04, 2024 | 4:01 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం లక్షద్వీప్‌లో స్నార్కెలింగ్‌ను ఆస్వాదించారు. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనకు సంబంధించిన ఆసక్తికరమైన చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. స్నోర్కెలింగ్ ఫోటోను పంచుకుంటూ, సాహసం చేయాలనుకునే వారి జాబితాలో లక్షద్వీప్ ఉండాలని ప్రధాని అన్నారు.

PM Narendra Modi: ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన.. నెట్టింట వైరల్ అవుతున్న మోదీ చిత్రాలు
Pm Narendra Modi In Lakshadweep
Follow us on

భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం లక్షద్వీప్‌లో స్నార్కెలింగ్‌ను ఆస్వాదించారు. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనకు సంబంధించిన ఆసక్తికరమైన చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. స్నోర్కెలింగ్ ఫోటోను పంచుకుంటూ, సాహసం చేయాలనుకునే వారి జాబితాలో లక్షద్వీప్ ఉండాలని ప్రధాని అన్నారు. స్నార్కెలింగ్ ప్రయత్నించాను. ఇది ఒక ఆహ్లాదకరమైన అనుభవం అంటూ ట్విట్టర్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

ప్రకృతి అందాలతో పాటు లక్షద్వీప్‌లోని ప్రశాంతత కూడా మంత్రముగ్దులను చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రశాంత వాతావరణం 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింత కష్టపడి ఎలా పని చేయాలో ఆలోచించే అవకాశాన్ని కల్పించిందన్నారు. స్నార్కెలింగ్‌తో పాటు, అందమైన బీచ్‌లో మార్నింగ్ వాక్ చేసిన చిత్రాలను కూడా ప్రధాని మోదీ పంచుకున్నారు. లక్షద్వీప్ కేవలం ద్వీపాల సమూహం కాదు, ఇది సంప్రదాయాల వారసత్వం, అక్కడ ప్రజల స్ఫూర్తికి నిదర్శనం. తన ప్రయాణం నేర్చుకుంటూ ఎదుగుతూ గొప్పగా సాగింది అంటూ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తన బీచ్ వాక్ చిత్రాలను కూడా పంచుకున్నారు. ఫోటోలో, ప్రధాని కుర్చీపై కూర్చుని సముద్ర దృశ్యాన్ని చూస్తున్నట్లు కనిపించారు.

అంతే కాకుండా, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల లబ్ధిదారులతో కూడా ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇందులో ఆయుష్మాన్ భారత్, పీఎం-కిసాన్, పీఎం-ఆవాస్, కిసాన్ క్రెడిట్ కార్డ్ వంటి పథకాల నుండి లబ్ధి పొందుతున్న వ్యక్తులు ఉన్నారు. అయితే ఇటీవలే లక్షద్వీప్ ప్రజల మధ్య ఉండే అవకాశం వచ్చింది. ద్వీపాల అద్భుతమైన అందం, అక్కడ ప్రజల అద్భుతమైన వెచ్చదనాన్ని ఇప్పటికీ విస్మయం చెందాను. అగట్టి, బంగారం, కవరత్తిలో ప్రజలతో మమేకమయ్యే అవకాశం లభించిందని, లక్షద్వీపం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…