Nitish on Modi: నితీష్‌ కుమార్‌ మాట్లాడుతుండగా భావోద్వేగానికి లోనైనా ప్రధాని నరేంద్ర మోదీ.. అసలు ఎమన్నారంటే..?

|

Jun 07, 2024 | 3:15 PM

శుక్రవారం (జూన్ 7) నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్ర మోదీని ఎన్డీయే పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సంధర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నరేంద్ర మోదీని ప్రశంసించారు

Nitish on Modi: నితీష్‌ కుమార్‌ మాట్లాడుతుండగా భావోద్వేగానికి లోనైనా ప్రధాని నరేంద్ర మోదీ.. అసలు ఎమన్నారంటే..?
Modi Nitish Kumar
Follow us on

శుక్రవారం (జూన్ 7) నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్ర మోదీని ఎన్డీయే పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సంధర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నరేంద్ర మోదీని ప్రశంసించారు. మీరు దేశానికి చాలా సేవ చేశారు, కానీ దేశ ప్రజలు గుర్తించలేకపోయారు. చాలా తక్కువ మెజార్టీ ఇచ్చారన్నారు. దీంతో మాటలు విన్న నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. నితీష్ కుమార్ సైగల ద్వారా విపక్షాలను లక్ష్యంగా చేసుకుని, ఈసారి అక్కడక్కడా అందరూ ఏదో ఒక విజయం సాధించారు. చివరికి అందరూ ఓడిపోతారు. దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే ఒక్క మోదీతోనే సాధ్యమన్నారు నితీశ్ కుమార్.

నరేంద్ర మోదీ దేశం మొత్తానికి సేవ చేశారని, ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వచ్చేసారి, అన్ని రాష్ట్రాలకు పూర్తి చేస్తానన్న పూర్తి విశ్వాసం తనకు ఉందని నితీష్ కుమార్ అన్నారు. ‘ప్రధానమంత్రి పదవి కోసం మా పార్టీ జనతాదళ్ (యునైటెడ్) భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నరేంద్ర మోదీకి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న ఆయన మళ్లీ ప్రధాని కాబోతుండడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఐదేళ్ళు వారితో ఉంటాం, వారు ఏమి చేసినా, ఎలా చేసినా చాలా బాగుంటుంది అని నితీశ్ కొనియాడారు.

మీరు దేశానికి ఎంతో సేవ చేశారనీ, ఇంత జరిగిన తర్వాత ఇలా జరిగిందేంటన్నారు. అయినప్పటికీ ఈసారి మీకు ఈ అవకాశం వచ్చిందన్నారు నితీశ్. ఇక ప్రతిపక్షాలకు స్కోప్ ఉండదన్నారు నితీశ్. మోదీ పాలనలో దేశం చాలా పురోగమిస్తుందన్నారు. ముఖ్యంగా బీహార్‌లో అన్ని పనులు పూర్తి అయ్యాయి. మిగిలి ఉన్నవి కూడా త్వరలోనే పూర్తి చేస్తాం, అందుకే మేము పూర్తిగా కలిసి ఉన్నామని నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. మీ వెంటే ఉంటాం. దేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తారు? మీరు వీలైనంత త్వరగా ప్రమాణ స్వీకారం చేయాలని మోదీకి నితీశ్ కుమార్ భరోసా ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…