PM Modi: ఇంటింటికీ సర్వే, టెస్టింగ్ చేయండి.. గ్రామాల్లో ఆరోగ్య సంరక్షణపై ఫోకస్.. కరోనా కట్టడి సమీక్షలో ప్రధాని మోదీ

కరోనా కట్టడిపై ప్రధాని మోదీ అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈసారి కరోనా ఎక్కువగా విజృంభిస్తోందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.

PM Modi: ఇంటింటికీ సర్వే, టెస్టింగ్ చేయండి.. గ్రామాల్లో ఆరోగ్య సంరక్షణపై ఫోకస్.. కరోనా కట్టడి సమీక్షలో ప్రధాని మోదీ
PM Narendra Modi

Updated on: May 15, 2021 | 4:00 PM

PM Modi High Level Review: కరోనా కట్టడిపై ప్రధాని మోదీ అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈసారి కరోనా ఎక్కువగా విజృంభిస్తోందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా నిర్ధారణ పెంచాలని సూచించారు. గ్రామాల్లో ఆక్సిజన్‌ సరఫరా కూడా పెంచాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో డోర్‌ టూ డోర్‌ సర్వే నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. కరోనా కట్టడికి ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్ల సేవలను ఉపయోగించుకోవాలన్నారు. అలాగే కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగాన్ని పెంచాలన్నారు.


దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై ప్రధాని మోదీ శనివారం అత్యున్నతస్థాయి సమావేశం. రాష్ట్ర, జిల్లాస్థాయిలో కరోనా పరిస్థితి, టెస్టులు, ఆక్సిజన్ లభ్యత, ఆరోగ్యసంరక్షణ మౌలికసదుపాయాలు, టీకా రోడ్‌మ్యాప్‌పై అధికారులు ప్రధానికి వివరించారు. వారానికి 50 లక్షల టెస్టుల నుంచి 1.3 కోట్ల టెస్టులకు పెరిగాయి. క్రమంగా తగ్గుతున్న పాజిటివిటీ రేటు, పెరుగుతున్న రికవరీ రేటు అంశాలను పీఎంకు వివరించారు. పాజిటివిటీ రేటు ఎక్కువున్నచోట టెస్టింగ్ మరింత పెంచాలని ఆయా రాష్ట్రాలకు సూచించారు. ఎక్కడికక్కడ కంటైన్మెంట్ వ్యూహాలే ఇప్పుడు చాలా అవసరమన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు పెంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్ సరఫరా సరిగా జరిగేలా చూడాలన్న ప్రధాని.. వెంటిలేటర్ల నిర్వహణ, తదితర పరికరాల వినియోగంలో సిబ్బందికి తగినవిధంగా శిక్షణ ఇవ్వాలి. సమీక్షలో అధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు.

Read Also….  Oxygen Concentrator: ఢిల్లీ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటి వద్దకే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ః కేజ్రీవాల్