Prime Minister Modi: తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధాని. నరేంద్ర మోదీ.. రైతన్నలపై కీలక వ్యాఖ్యలు..

|

Feb 14, 2021 | 2:47 PM

తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడి రైతులపై ప్రశంసలు కురిపించారు. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించారని

Prime Minister Modi: తమిళనాడులో పర్యటిస్తున్న  ప్రధాని. నరేంద్ర మోదీ.. రైతన్నలపై కీలక వ్యాఖ్యలు..
Follow us on

తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడి రైతులపై ప్రశంసలు కురిపించారు. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించారని తమినాడు రైతులను మోదీ అభినందించారు. జల వనరులను సమర్థంగా వినియోగించుకుని ఇక్కడి రైతులు భారీ దిగుబడులను రాబట్టారని చెన్నైలో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ప్రశంసించారు. నీటిని సంరక్షించేందుకు మనం శక్తి వంచన లేకుండా పనిచేయాలని.. ప్రతి నీటి బొట్టును మరింత దిగుబడికి అనువుగా మలుచుకోవాలనే నినాదం రైతులు ముందుకెళ్ళాలని కోరారు.

అలాగే చెన్నై మెట్రో రైల్ విస్తరణతోపాటు పలు మౌలిక ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ప్రధాని తమిళనాడు పర్యటనలో ఉన్నారు. మెట్రో రైలు మలిదశలో 9 కిలోమీటర్ల లైన్ ప్రారంభించుకోవడం సంతోషకరమని మోదీ అన్నారు. కరోనా మహమ్మారి వెంటాడినా అనుకున్న సమయానికి ఈ ప్రాజెక్టును అధికారులు, కాంట్రాక్టర్లు పూర్తిచేశారని అన్నారు. చెన్నై మెట్రో వేగంగా జరుగుతుందని.. ఈ ఏడాది బడ్జెట్‌లో మెట్రో రెండో దశకు రూ 63,000 కోట్లు కేటాయించామని చెప్పారు. ఏ నగరంలోని ప్రాజెక్టుకైనా ఈ స్ధాయిలో భారీ నిధులు కేటాయించడం ఇదే తొలిసారని చెప్పారు. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో మౌలిక ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవడం గమనార్హం.

Also Read: కోవిడ్ నేపథ్యంలో ప్రధానికి స్వాగత ఏర్పాట్లపై ఆంక్షలు, ఐదుగురు అధికారులకు మాత్రమే అనుమతి