కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యింది. ఉదయం ఏడున్నరకు ప్రారంభమయ్యే కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. విపక్ష నేతలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడంపై మండిపడింది బీజేపీ. ప్రజాస్వామ్యాన్ని , రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నారని విమర్శించింది.
భారత కొత్త పార్లమెంట్ మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని రెండు దశలుగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునే పాత పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పూజ కార్యక్రమాలు చేపడుతారు. ఉదయం 7.30 గంటలకు పూజ కార్యక్రమం ఉంటుంది. ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సహా పలువురు సీనియర్ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 9.30గంటలకు లోక్‌సభ స్పీకర్ కుర్చీ కుడి పక్కన రాజదండం ప్రతిష్ఠిస్తారు. పూజ తరువాత అందరూ లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్లను సందర్శిస్తారు. ఉదయం 9.30గంటలకు లోక్‌సభ స్పీకర్ కుర్చీ కుడి పక్కన రాజదండాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో పాటు సెంగోల్ రూపకర్తలు సైతం హాజరుకానున్నారు. తరువాత పూజ కార్యక్రమం ఉంటుంది.
తమిళనాడు లోని తిరువాదుతురై అధీనంతో సహా 20 ఆధీనాలకు చెందిన మఠాధిపతులు పార్లమెంట్ ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథులుగా హాజరవుతున్నారు. తిరువాదుతురై అధీనం మఠాధిపతి ప్రధాని మోదీకి రాజదండాన్ని అప్పగిస్తారు. అనంతరం మఠాధిపతులతో భేటీ అవుతారు మోడీ. ఇక మధ్యాహ్నం జాతీయ గీతాలాపనతో రెండో దశ ప్రారంభ వేడుకలు మొదలుకానున్నాయి. లోక్‌సభ ఛాంబర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా అతిథులు హాజరుకానున్నారు. పార్లమెంట్ నిర్మాణం సమయంలోని అనేక ఘట్టాలతో రూపొందించిన వీడియోలను ప్రదర్శిస్తారు. చివరగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడతారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
అయితే కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీహార్ సీఎం నితీష్‌కుమార్ . అసలు కొత్త పార్లమెంట్ భవనం అక్కర్లేదన్నారు నితీష్. ఇప్పుడు ఉన్న భవనంలో దశాబ్దాల నుంచి చట్టాలను ఆమోదిస్తున్నారని అన్నారు. చరిత్రను మార్చేందుకే కొత్త పార్లమెంట్ లాంటి భవనాలను నిర్మిస్తున్నారని బీజేపీపై విరుచుకుపడ్డారు నితీష్. ప్రధాని మోదీ పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభిస్తున్న సందర్భానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం రూ.75 విలువైన స్మారక నాణెంను విడుదల చేయనుంది.
May this Temple of Democracy continue strengthening India’s development trajectory and empowering millions. #MyParliamentMyPride https://t.co/hGx4jcm3pz
— Narendra Modi (@narendramodi) May 27, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం