PM Modi: సెయింట్‌ రవిదాస్‌జీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం.. వీడియో

వారణాసిలో పర్యటిస్తోన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 647వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారాయన. ఈ సందర్భంగా సెయింట్‌ రవిదాస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ రవిదాస్ జీ సమాజానికి స్వేచ్ఛ, ప్రాముఖ్యతను చెప్పారని గుర్తు చేశారు. అలాగే సమాజంలో అంటరానితనం, వివక్ష వంటి వాటికి వ్యతిరేకంగా పోరాడారని కొనియాడారు

PM Modi: సెయింట్‌ రవిదాస్‌జీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం.. వీడియో
Pm Narendra Modi, Cm Yogi

Updated on: Feb 23, 2024 | 1:48 PM

వారణాసిలో పర్యటిస్తోన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 647వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారాయన. ఈ సందర్భంగా సెయింట్‌ రవిదాస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ రవిదాస్ జీ సమాజానికి స్వేచ్ఛ, ప్రాముఖ్యతను చెప్పారని గుర్తు చేశారు. అలాగే సమాజంలో అంటరానితనం, వివక్ష వంటి వాటికి వ్యతిరేకంగా పోరాడారని కొనియాడారు. కాగా విగ్రహావిష్కరణ అనంతరం సెయింట్‌ రవిదాస్‌ జన్మస్థలిని సందర్శించనున్నారు మోడీ. ఈ ప్రాంతం చుట్టూ సుమారు రూ. 32 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా రవిదాస్‌ జన్మస్థలి చుట్టూ సుందరీకరమైన పార్క్, మ్యూజియంలు ఏర్పాటుచేయనున్నారు. రవిదాస్‌ విగ్రహావిష్కరణ అనంతరం అమూల్ అతిపెద్ద ప్లాంట్ బనాస్ డెయిరీని ప్రారంభించనున్నారు. అలాగే రూ. 14 వేల కోట్లకు పైగా విలువైన 36 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. వారణాసిలో రోడ్డు కనెక్టివిటీని మరింత మెరుగుపరచడానికి, ప్రధానమంత్రి అనేక రహదారి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. వీటిలో NH-233లోని ఘర్గ్రా-బ్రిడ్జ్-వారణాసి సెక్షన్ నాలుగు లైన్ల రహదారి, NH-56 సుల్తాన్‌పూర్-వారణాసి సెక్షన్ నాలుగు లేనింగ్ (ప్యాకేజీ-1), వారణాసి-ఔరంగాబాద్ సెక్షన్ ఫేజ్-1  ఆరు-లేనింగ్ ఉన్నాయి. NH-19, NH-35లో ప్యాకేజీ-1 వారణాసి-హనుమాన సెక్షన్ నాలుగు-లేనింగ్, బాబత్‌పూర్ సమీపంలో వారణాసి-జాన్‌పూర్ రైలు విభాగంలో రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ (ROB) నిర్మాణం. వారణాసి-రాంచీ-కోల్‌కతా ఎక్స్‌ప్రెస్‌వే ప్యాకేజీ-1 నిర్మాణాలకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

సెయింట్ రవివాస్ విగ్రహావిష్కరణలో ప్రధాని మోడీ, సీఎం యోగి

 

 

ఇవి కూడా చదవండి