ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మంగళవారం (జనవరి 2), బుధవారం (జనవరి 3) తేదీల్లో తమిళనాడు, లక్షద్వీప్, కేరళను విజిట్ చేయనున్నారు. పర్యటనలో భాగంగా19,850 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోదీ దక్షిణాది నుంచి పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. టూర్ లో భాగంగా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించనున్నారు. తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో 1,112 కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. తిరుచిరాపల్లిలోని భారతీదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవ వేడుకల్లో కూడా మోదీ పాల్గొంటారు. యూనివర్శిటీ హాల్‌లో 33 మందికి పట్టాలను ప్రదానం చేశాక ప్రసంగిస్తారు. రెండు కార్యక్రమాల్లోనూ తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాల్గొంటారు. పర్యటనలో భాగంగా ప్రధాని తమిళనాడు బీజేపీ నేతలతో సమావేశమతారని సమాచారం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితా పరిశీలించడంతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారని తెలిసింది.
ప్రధాని మోదీ రేపు కేరళలోని త్రిసూర్ సందర్శించనున్నారు. ఆయనకు స్వాగతం పలుకుతూ అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులు, ఫ్లెక్సీలు, జెండాలను త్రిసూర్ మున్సిపాలిటి సిబ్బంది తొలగించారు. దీన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు త్రిసూర్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు. సీపీఎం బోర్డులు, ఫ్లెక్సీలకు వర్తించని నిబంధనలు బీజేపీకి వర్తిస్తాయా అని ప్రశ్నించారు. మరోవైపు మోదీ త్రిసూర్ పర్యటన నేపథ్యంలో మహిళా మోర్చా కార్యకర్తలు మెగా తిరువథిర పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సుమారు రెండు వేల మంది సంప్రదాయ నృత్యాలు అభ్యాసం చేశారు.
Over the next two days, I will be attending various programmes in Tamil Nadu, Lakshadweep and Kerala. The programmes will begin from Tiruchirappalli in Tamil Nadu, where I will address the Convocation Ceremony of the Bharathidasan University. The new terminal building of the…
— Narendra Modi (@narendramodi) January 1, 2024
A great start to 2024 thanks to our scientists! This launch is wonderful news for the space sector and will enhance India’s prowess in this field. Best wishes to our scientists at @isro and the entire space fraternity in taking India to unprecedented heights. https://t.co/4O4F6kRpEX
— Narendra Modi (@narendramodi) January 1, 2024