pm narendra modi to tamilnadu visit : భారత ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు, పాండిచ్చేరి పర్యటించబోతున్నారు. గురువారం ఆయన రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేయనున్నారు. ‘‘దేశ అభివృద్ధిలో తమిళనాడు సహకారాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా తమిళనాడు సంస్కృతి చాలా ప్రసిద్ధి. తమిళనాడు అభివృద్ధిని చూసి కేంద్రం గర్విస్తోంది. రేపు తమిళనాడులో పర్యటిస్తున్నాను. వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తాను.’’ అని మోదీ ట్వీట్ చేశారు. అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కోయంబత్తూరు పర్యటనకు
Leaving for Puducherry and Tamil Nadu to inaugurate development works that will further ‘Ease of Living’ and economic growth. pic.twitter.com/7b6T4OJnI6
— Narendra Modi (@narendramodi) February 25, 2021
పలు అభివృద్ధి పనులను ప్రారంభించబోతున్నారు. రానున్న ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పనిచేసేందుకు సిద్ధమైన కాషాయం పార్టీ.. ద్రవిడ గడ్డపై అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఎలాగైనా తమిళనాట పాగా వేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ పర్యటన ఉత్కంఠగా మారింది.
అన్నాడీఎంకేతో కలిసి తమిళనాట కాషాయ జెండా ఎగరేయాలనుకుంటున్నారు ప్రధాని మోదీ. కానీ రెండు వర్గాలుగా విడిపోయాయి పార్టీ వర్గాలు. దీంతో రెండాకులుగా చీలిపోయిన ఇరు వర్గాలను ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇటు పళని, అటు చిన్నమ్మ వర్గాలను కలుపుకుపోవడానికి మోదీ వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. కాగా, ఇవాళ్టి ప్రధాని పర్యటన సర్వత్రా ఉత్కంఠ రేపుతోందిజ. తమిళ పీఠం కోసం ప్రధాని మంత్రమేంటి..? ఇదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also… కేరళలో దారుణం.. ఆర్ఎస్ఎస్ కార్యకర్త దారుణ హత్య.. అలప్పుజాలో బంద్ ప్రశాంతం