
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమి అద్భుత అస్త్రాలను ప్రయోగిస్తోంది. ప్రధాని మోదీ సీఎం మహిళా రోజ్‌గార్ యోజనను ప్రారంభిస్తున్నారు. తొలి విడతగా మహిళల ఖాతాలో 10 వేల రూపాయలు జమ చేస్తారు. 75 లక్షల మంది మహిళలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది. రూ. 7500 కోట్ల ఖర్చుతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు.
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి మరింత రాజుకుంది. ఎన్నికల్లో గెలుపు కోసం అటు ఎన్డీఏ కూటమి , ఇటు ఇండి కూటమి అన్ని ఎత్తులను ప్రయోగిస్తున్నాయి. సీఎం నితీష్ అద్భుత అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. సీఎం మహిళా రోజ్‌గార్ యోజనను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌తో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఎంపిక చేసన మహిళల ఖాతాలో రూ. 10 వేలు జమ చేస్తారు. స్వయం ఉపాథి కోసం ప్రతి మహిళకు రూ. 2 లక్షల సాయం అందిస్తారు. తొలి విడతలో 10 వేల రూపాయాలను జమ చేస్తున్నారు. 75 లక్షల మంది మహిళలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది. రూ. 7500 కోట్ల ఖర్చుతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రోజ్‌గార్ యోజనను ఎన్డీఏ కూటమి గేమ్ ఛేంజర్‌గా భావిస్తోంది. మహారాష్ట్రలో కూడా ఇలాంటి స్కీము తోనే ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా పాట్నా చేరుకుంటున్నారు. ఎన్డీఏ కూటమి నేతలతో సీట్లు సర్దుబాటుపై అమిత్‌షా చర్చిస్తారు. అయితే ఎన్నికల వేళ మహిళా రోజ్‌గార్ యోజనను అమలు చేయడంపై ఇండి కూటమి నేతలు మండిపడుతున్నారు. బిహార్ మహిళలు చాలా తెలివైన వాళ్లని , సీఎం నితీష్ మాత్రం పథకాలను కాపీ కొట్టడంతో ఆరితేరిపోయారని విపక్ష నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారం లోకి రాగానే మహిళల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తామన్నారు. బిహార్‌లో ప్రతి మహిళ మార్పును కోరుకుంటున్నారని అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ పదునైన వ్యూహాన్ని రచిస్తోంది. బీజేపీ ఎన్నికల రాష్ట్ర ఇంచార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను నియమించారు. సహ ఇంచార్జ్‌లుగా కేశవ్‌ప్రసాద్ మౌర్య , సీఆర్ పాటిల్‌ను నియమించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..