PM Modi: శివమొగ్గ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది.. ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం ఇచ్చిన ప్రధాని మోదీ..

ఎన్నికల వేళ ప్రధాని మోదీ కర్నాటక సుడిగాలి పర్యటన చేశారు. శివమొగ్గ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించారు. విపక్షాలు తన చావును కోరుకుంటున్నాయని బెల్గాంలో జరిగిన సభలో మండిపడ్డారు మోదీ.

PM Modi: శివమొగ్గ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది.. ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం ఇచ్చిన ప్రధాని మోదీ..
Pm Modi Shivamogga Airport

Updated on: Feb 27, 2023 | 9:09 PM

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ శివమొగ్గ ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితమిచ్చారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమానికి కర్నాటక మాజీ సీఎం యడియూరప్ప , సీఎం బస్వరాజ్‌ బొమ్మైతో పాటు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి హాజరయ్యారు. బీజేపీ కురువృద్ద నేత యడియూరప్ప జన్మదినం వేళ శివమొగ్గ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు మోదీ. తమకు ఎయిర్‌పోర్ట్‌ కావాలని ఎప్పటి నుంచో ఉద్యమిమిస్తున్నారని , శివమొగ్గ ప్రజల కల ఇప్పటికి నెరవేరిందన్నారు మోదీ. శివమొగ్గకు ఎంతో చరిత్ర ఉందన్నారు . ఎన్నో సాంప్రదాయాలతో పాటు ఆధునికతకు కూడా శివమొగ్గ మారుపేరని అన్నారు. కొత్త ఎయిర్‌పోర్ట్‌తో శివమొగ్గలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు మోదీ.

బెల్గాంలో జరిగిన సభలో పాల్గొన్నారు మోదీ. విపక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. కొన్ని పార్టీలు తన చావును కోరుకుంటున్నాయని , కాని దేశ ప్రజలు మాత్రం మోదీ మీ కమలం వికసిస్తుందని దీవిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే అంటే తనకు గౌరవం ఉందని , కాని ఆయన కూడా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుననారని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ పార్టీతో కర్నాటక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్‌ నేతలు ఎంత నైరాశ్యంలో ఉన్నారంటే మోదీ బతికున్నంత కాలం మా ఆటలు సాగవని అనుకుంటున్నారు. అందుకే వాళ్లంతా ఇప్పుడు నా చావును కోరుకుంటున్నారు .. కొంతమంది నా సమాధి తవ్వే పనిలో బిజీగా ఉన్నారు. మోదీ నీ సమాధి తవ్వుతాం అని బెదిరిస్తున్నారు. బెల్గాంలో భారీ రోడ్‌షో నిర్వహించారు మోదీ. రహదారికి ఇరువైపుల జనం మోదీకి ఘనస్వాగతం పలికారు. బెల్గాం ప్రజలు చూపించిన అప్యాయతను ఎప్పటికి మరవలేనని అన్నారు మోదీ.

అంతేకాకుండా.. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించేలా సుమారు రూ. 190 కోట్లతో పునర్‌నిర్మించిన బెలగావి రైల్వే స్టేషన్ భవనాన్ని ఆయన జాతికి అంకితం చేయనున్నారు. దీంతోపాటు 930 కోట్లతో లోండా-బెలగావి మధ్య రైలు మార్గం డబ్లింగ్ ప్రాజెక్టును కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ రద్దీగా ఉండే ముంబై-పుణె-హుబ్బల్లి-బెంగళూరు రైలు మార్గంలో లైన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది ఈ ప్రాంతంలో వాణిజ్యం, వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం