Israel-Palestine Conflict: ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు.. స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే ?

|

Oct 07, 2023 | 5:38 PM

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ మెరుపు దాడితో ఇజ్రాయెల్‌లో ప్రస్తతం యుద్ధ పరిస్థితులు కొనసాగడం కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్లు జరిపిన దాడులతో 50 మంది ఇజ్రాయెల్‌ పౌరుల మృతిచెందగా..100 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. అంతేకాదు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ వీధుల్లో తిరుగుతూ పౌరులపై కాల్పులు జరుపుతున్నారు. అలాగే ఇజ్రాయెల్‌ సైనికులను బందీగా చేసుకుని వారిని నేలపై లాక్కుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Israel-Palestine Conflict: ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు.. స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే ?
Pm Modi
Follow us on

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ మెరుపు దాడితో ఇజ్రాయెల్‌లో ప్రస్తతం యుద్ధ పరిస్థితులు కొనసాగడం కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్లు జరిపిన దాడులతో 50 మంది ఇజ్రాయెల్‌ పౌరుల మృతిచెందగా..100 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. అంతేకాదు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ వీధుల్లో తిరుగుతూ పౌరులపై కాల్పులు జరుపుతున్నారు. అలాగే ఇజ్రాయెల్‌ సైనికులను బందీగా చేసుకుని వారిని నేలపై లాక్కుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇప్పటికే యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, రష్యా, ఉక్రెయిన్ తదితర దేశాలు ఇజ్రాయెల్‌పై జరిపిన దాడులను తీవ్రంగా ఖండించాయి. అలాగే ఇప్పుడు ఈ జాబితాలో భారత్ కూడా చేరింది. హమాస్ మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదులు దాడి చేయడంపై విచారం వ్యక్తం చేశారు. ఈ దాడులకు గురైన బాధితులకు, వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో తాము ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలుపుతున్నామని ప్రధాని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..