గుజరాత్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుడిగాలి పర్యటన కొనసాగుతోంది. అహ్మదాబాద్‌లో ఐదు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. విశాఖ-దుర్గ్ , సికింద్రాబాద్-నాగ్‌పూర్, ఆగ్రా-బనారస్, కొల్హాపూర్-పుణే, పుణే-హుబ్లీ మధ్య ఈ రైళ్లు నడుస్తాయి. అహ్మదాబాద్‌లో రూ. 8000 కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులను సైతం ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా.. గుజరాత్‌లోని భుజ్- అహద్మాబాద్ మధ్య కొత్త రైలు సర్వీసును ప్రధాని మోదీ ప్రారంభించారు. కాగా.. విశాఖ – దుర్గ్ వందే భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. వర్చువల్ గా ప్రధానమంత్రి మోదీ ప్రారంభించగా.. విశాఖలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ భరత్, డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 20830 నెంబరుతో విశాఖ నుంచి దుర్గ్ కు వందే భారత్ సర్వీసు నడవనుంది.. ప్రధాని మోదీ ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ భరత్, డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ రైలులో ప్రయాణించారు.
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी द्वारा देश को #NamoBharatRapidRail के साथ 5 नई #VandeBharatExpress की सौगात दी गई, साथ ही गुजरात में रेल इन्फ्रास्ट्रक्चर को सशक्त करने वाली कई परियोजनाओं का शिलान्यास किया गया।#RailInfra4Gujarat#RapidRail pic.twitter.com/5UzxNA11ti
— Western Railway (@WesternRly) September 16, 2024
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. వందే భారత్ రైలుతో భారతదేశ గొప్పతనం సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలుస్తుందని తెలిపారు. ఆత్మ నిర్భరభారత్, మేకిన్ ఇండియా కు వందే భారత్ ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. విశాఖ – దుర్గ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఉత్తరాంధ్రలోని విశాఖ విజయనగరంతో పాటు పార్వతీపురానికి హాల్టింగు ఇచ్చినందుకు రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే విశాఖ నుంచి 3 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని.. అదనంగా దుర్గ్ కు మరో రైలు తో చత్తీస్గఢ్ కు కనెక్టివిటీ పెరిగిందన్నారు. మరిన్ని రైళ్లు ఏపీకు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు.
Dignitaries boarded the new Visakhapatnam-Raipur (Durg) #VandeBharatExpress accompanied by DRM/WAT Shri Saurabh Prasad and jovially interacting with on board railway personnel.#namobharatrapidrail #RailInfra4Gujarat #RapidRail@RailMinIndia pic.twitter.com/ehVFGEogkF
— East Coast Railway (@EastCoastRail) September 16, 2024
రైల్వే జోన్ కు సంబంధించి భూముల క్లియరెన్స్ ఇచ్చామని.. కేంద్రానికి రాష్ట్రం తరఫున ల్యాండ్ ను అప్పగించామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన వీలైనంత తొందరగా చేయాలని కోరామన్నారు. త్వరలో రైల్వే జోన్ కోసం పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..