కర్నాటకలో జరిగిన 26వ జాతీయ యువజనోత్సవాల వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. అంతకు ముందు హుబ్లీకి చేరుకున్న ప్రధాని మోదీ నగరంలోని ప్రధాన వీధిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఈ యువజనోత్సవాల ప్రారంభ వేడుకలకు 30వేలకు పైగా యువకులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రైల్వే స్పోర్ట్స్ గ్రౌండ్‌లో ప్రారంభోత్సవం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఐదు రోజుల పండుగను నిర్వహిస్తోంది.
ఎన్నికల వేళ కర్నాటక లోని హుబ్లీలో ప్రధాని మోదీ మెగా రోడ్ షో నిర్వహించారు. రోడ్‌షోలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. హుబ్లీ ప్రధాన వీధుల్లో మోదీ రోడ్‌షా సాగింది. తరువాత నేషనల్ యూత్ ఫెస్టివల్‌ను ప్రారంభిస్తున్నారు మోదీ. స్వామీ వివేకానంద జయంతి వేళ నేషనల్ యూత్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు.
హుబ్లీలో ప్రధాని మోదీ రోడ్ షో..
Karnataka | PM Narendra Modi receives a warm welcome as he holds a roadshow in Hubballi.
(Source: DD) pic.twitter.com/nlZMtmdSJJ
— ANI (@ANI) January 12, 2023
హుబ్లీలో ప్రధాని మోదీ రోడ్‌షోలో భద్రతా వైఫల్యం బయటపడింది. మోదీ దగ్గరకు దూసుకొచ్చాడు ఓ యువకుడు . మోదీకి పూలదండ వేసేందుకు అతడు ప్రయత్నించాడు సెక్యూరిటీ సిబ్బంది తోసుకొని ఆ యువకుడు ముందుకు రావడంతో అందరూ ఉలిక్కి పడ్డారు. మోదీకి అతిసమీపంగా వెళ్లిన వ్యక్తిని చివరకు వెనక్కి లాగేశారు. హుబ్లీలో రోడ్‌షో నిర్వహిస్తున్న సమయంలో ఈ అనూహ్యమైన ఘటన జరిగింది. యువకుడి చేతిలో ఉన్న పూలదండను తీసుకున్నారు మోదీ.
ఇదిలావుంటే హుబ్లీలో గురువారం జరగిన ప్రధాని మోదీ కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆహ్వానించలేదు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ప్రోటోకాల్ మేరకు మాజీ సీఎం యడ్యూరప్పను ఆహ్వానించలేదని బీజేపీ తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం