‘ఓటుబ్యాంక్ రాజకీయాలు బీజేపీ నైజం కాదు..అభివృద్దే మా ఏజెండా’ అని కర్ణాటక పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతేకాక వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం మద్ధతునిస్తుందన్నారు మోదీ. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ రోజు(జనవరి 19) పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగానే కర్ణాటకలోని యాదగిరి, కలబురగి జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభించారు. యాదగిరిలోని కోడెగాలో జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టుతో పాటు, సాగునీరు, తాగునీటికి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించారు ప్రధాని. జల్ జీవన్ మిషన్ కింద బహుళ గ్రామాల తాగునీటి సరఫరా పథకంతో పాటు యాదగిరిలో నారాయణపూర్ ఎడమ గట్టు కాలువ పొడిగింపు, పునరుద్ధరణ, ఆధునీకరణ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు.
అయితే కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా యాదగిరి జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మోదీ ప్రసంగాన్ని వినేందుకు సమీప ప్రాంతాలలో ఉన్న బంజారా వర్గీయులు, ముఖ్యంగా మహిళలు తండోపతండాలుగా తరలివచ్చారు.
The Banjara community in #Yadgiri.
All excited to listen and greet Hon’ble PM Shri @narendramodi ji. pic.twitter.com/LQGol0zZhO
— Pradipsinh Vaghela (@pradipsinhbjp) January 19, 2023
Elated to be in Yadgiri. Projects pertaining to water security, farmer welfare & connectivity are being launched, which will significantly benefit the region. https://t.co/jJFYGkrNSu
— Narendra Modi (@narendramodi) January 19, 2023