PM Modi: అదే మోదీ గొప్పతనం.. ఛత్తీస్​గఢ్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని ఏం చేశారంటే..

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రులుగా అరుణ్ సావో, విజయ్ శర్మ కూడా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంతి యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం హిమంతబిశ్వ శర్మ, ఛత్తీస్​గఢ్ మాజీ ముఖ్యమంత్రులు భూపేశ్ బఘేల్..

PM Modi: అదే మోదీ గొప్పతనం.. ఛత్తీస్​గఢ్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని ఏం చేశారంటే..
Pm Modi

Updated on: Dec 13, 2023 | 6:47 PM

ఛత్తీస్​గఢ్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్​ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్ర రాజధాని రాయ్​పుర్​లోని సైన్స్​ కళాశాల మైదానంలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రులుగా అరుణ్ సావో, విజయ్ శర్మ కూడా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంతి యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం హిమంతబిశ్వ శర్మ, ఛత్తీస్​గఢ్ మాజీ ముఖ్యమంత్రులు భూపేశ్ బఘేల్, రమణ్​సింగ్ హాజరయ్యారు. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రం వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పనికి వేదికపై ఉన్న వారితో పాటు హాజరైన ప్రజలు అవాక్కయ్యారు.

ప్రధాని, గవర్నర్‌కు వేసిన కుర్చిల ముందు ఓ చిన్నపాటి టేబుల్‌ను ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఆ టేబుల్‌ను పక్కకు జరపాల్సి ఉంది. గవర్నర్‌ ఆ టేబుల్‌ను పక్కకు జరిపేందుకు ప్రయత్నించగా, వెంటనే ప్రధాని మోడీ ఆ టేబుల్‌ను పక్కకు జరిపేందుకు సహకరించారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఇప్పుడు ప్రధాని ఇలా టేబుల్‌ను జరపడం అందరికిలో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

 


ఇదిలా ఉండగా, దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. డిసెంబర్​ 3వ తేదీన వెలువడిన ఫలితాల్లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ ఏకంగా 54 స్థానాల్లో విజయం సాధించింది. ఎగ్జిట్​ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ విజయకేతనం కమలం. 90 సీట్లు ఉన్న అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి