Corona Third Wave: మూడో దశ ముప్పుకు రెడీగా ఉండండి.. ఆక్సిజన్‌ నిల్వలు.. సరఫరాపై ప్రధాని మోడీ హై లెవల్‌ మీటింగ్‌

|

Jul 09, 2021 | 10:27 PM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR.. మరోసారి వాసాలమర్రి గ్రామానికి రానున్నారు. ఈ గ్రామాన్ని CM KCR దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పర్యటించిన ఈయన..2021, జూలై 10వ తేదీ శనివారం ఈ గ్రామంలో పర్యటించాలని...

Corona Third Wave: మూడో దశ ముప్పుకు రెడీగా ఉండండి.. ఆక్సిజన్‌ నిల్వలు.. సరఫరాపై ప్రధాని మోడీ హై లెవల్‌ మీటింగ్‌
Modi Cabinet
Follow us on

దేశానికి కరోనా ముప్పు ఇంకా తొలిగిపోలేదని.. మరి కొద్ది రోజుల్లో ధర్డ్‌వేవ్‌ పొంచి ఉందని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందు కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలయ్యాయి. పీఎం-కేర్స్‌ సహకారంతో త్వరలో దేశవ్యాప్తంగా 1500 పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు కాబోతున్నాయి. వీలైనంత త్వరగా ఈ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు ప్రధాని మోదీ..

మూడో దశ ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న మోదీ సర్కార్‌ థర్డ్‌ వేవ్‌పై ముందే మేల్కొన్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆక్సిజన్‌ నిల్వలు.. సరఫరాపై హై లెవల్‌ మీటింగ్‌ నిర్వహించారు ప్రధాని మోదీ.  ఓవైపు వ్యాక్సినేషన్‌ను విస్తరిస్తూనే మరోవైపు కరోనా ఔషధాలు, ప్రాణవాయువు కొరత ఏర్పడకుండా ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది కేంద్రం. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వలపై కీలక సమీక్ష నిర్వహించారు.

త్వరలో దేశవ్యాప్తంగా 1500 PSA ఆక్సిజన్‌ ప్లాంట్లు రానున్నాయి. పీఎం-కేర్స్‌ సహకారంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాణవాయువు లభ్యత, ప్లాంట్ల నిర్మాణంపై సమీక్షించారు మోదీ. వీలైనంత త్వరగా PSA ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు ప్రధాని మోదీ. ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణపై ఆస్పత్రి సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని ప్రధాని సూచించారు. వాటి పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేలా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని రూపొందించాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి: Revanth Reddy: అంతా అక్కడి నుంచి వచ్చినవారే.. మంత్రి హరీష్ రావుకు పీసీసీ చీఫ్ రేవంత్ కౌంటర్

Cabinet Meeting: ఈనెల 13న తెలంగాణ కేబినెట్ భేటీ.. కరోనా పరిస్థితి, వ్యవసాయంతోపాటు పలు అంశాలపై చర్చ