PM Modi: ఇది చారిత్రాత్మకమైనది.. స్వాతంత్య్రం తర్వాత ఫస్ట్ టైమ్.. కొత్త లేబర్ కోడ్‌లపై ప్రధాని మోదీ కీలక కామెంట్స్..

కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కొత్త కార్మిక కోడ్‌లు అమల్లోకి వచ్చాయి. ఇవి 29 పాత చట్టాలను రద్దు చేస్తూ, కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రతను పెంచుతాయి. కనీస వేతనం, గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, మహిళలకు సమాన వేతనం వంటివి ఈ సంస్కరణల ముఖ్యాంశాలు. ఈ చారిత్రక నిర్ణయం దేశ కార్మిక వ్యవస్థను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మారుస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

PM Modi: ఇది చారిత్రాత్మకమైనది.. స్వాతంత్య్రం తర్వాత ఫస్ట్ టైమ్.. కొత్త లేబర్ కోడ్‌లపై ప్రధాని మోదీ కీలక కామెంట్స్..
Pm Modi Hails New Labour Codes

Updated on: Nov 21, 2025 | 4:57 PM

స్వాతంత్య్రం  వచ్చినప్పటి నుండి అత్యంత సమగ్రమైన, ప్రగతిశీలమైన సంస్కరణగా భావిస్తున్న నాలుగు కొత్త కార్మిక కోడ్‌లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించింది. ఇందులో భాగంగా 29 పాత కేంద్ర కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు కొత్త కార్మిక కోడ్‌లను నేటి నుంచి అమలులోకి తీసుకొచ్చింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా దశాబ్దాల నాటి సంక్లిష్టమైన నిబంధనలు సరళీకృతం కావడం, కార్మికుల సంక్షేమం పెరగడం, దేశ కార్మిక పర్యావరణ వ్యవస్థ ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మారడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ అంశంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇది అత్యంత ప్రగతిశీల కార్మిక-ఆధారిత సంస్కరణలలో ఒకటి. ఇది కార్మికులకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా ఇది చట్టపరమైన ప్రక్రియలను చాలా ఈజీగా మారుస్తుంది. వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది’’ అని ప్రధాని మోదీ అన్నారు.

అమలులోకి వచ్చిన నాలుగు కొత్త కోడ్‌లు:

  • వేతనాల కోడ్
  • పారిశ్రామిక సంబంధాల కోడ్
  • సామాజిక భద్రత కోడ్
  • వృత్తి భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్

కీలక సంస్కరణలు.. కార్మికుల భవిష్యత్తుకు భరోసా

ఈ కోడ్‌లు భవిష్యత్తుకు అవసరమయ్యే శ్రామిక శక్తిని సృష్టించే లక్ష్యంతో రూపొందించారు. కొత్త చట్టం అనేక దశాబ్దాల నాటి సమస్యలను పరిష్కరిస్తుంది.

కనీస వేతనం: దేశంలోని కార్మికులందరికీ కనీస వేతనం పొందే చట్టబద్ధమైన హక్కు కల్పిస్తారు.

నియామక పత్రం: కార్మికులందరికీ కంపెనీలు తప్పనిసరిగా అపాయింట్‌మెంట్ లెటర్స్ అందించాలి.

సకాలంలో వేతనాలు: వేతనాలను ఆలస్యం చేయకుండా లేదా విచక్షణా రహితంగా చెల్లించే పద్ధతులకు ముగింపు పలకడం.

ఉచిత ఆరోగ్య పరీక్షలు:40 ఏళ్లు పైబడిన కార్మికులకు ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి చేస్తారు.

గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత

ఈ సంస్కరణల్లో అత్యంత కీలకమైనది గిగ్, ప్లాట్‌ఫామ్, అనధికారిక కార్మికులకు సామాజిక భద్రతను కల్పించారు.  గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులతో సహా అందరికీ పీఎఫ్, ఈఎస్ఐ వంటి ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిధుల కోసం అగ్రిగేటర్లు తమ టర్నోవర్‌లో 1-2శాతం విరాళంగా అందించాలి.

మహిళలకు కొత్త అవకాశాలు

రాత్రి షిఫ్ట్‌లు: భద్రతకు పూర్తి ఏర్పాట్లు చేసిన తర్వాత మహిళలు రాత్రి షిఫ్ట్‌లలో కూడా పనిచేయవచ్చు. వారికి సమాన వేతనం, భద్రత లభిస్తాయి.

సమాన వేతనం: లింగ వివక్ష లేకుండా, పురుషులతో సమానంగా మహిళలకు కూడా జీతాలు చెల్లించడం తప్పనిసరి.

ఈ కొత్త చట్టాల ద్వారా దేశంలో దాదాపు 64 శాతం మంది కార్మికులకు సామాజిక భద్రతా రక్షణ లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.