Vande Bharat Express: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఒకే రోజు రెండు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ..

ముంబైలో రెండు వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రెండు వందే భారత్ రైళ్లు ముంబై-సోలాపూర్, ముంబై-షిర్డీలను నడవబోతున్నాయి.

Vande Bharat Express: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఒకే రోజు రెండు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ..
PM Modi Flags Off Vande Bharat Trains
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 10, 2023 | 6:02 PM

ముంబై నుంచి రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించారు ప్రధాని మోదీ. ముంబై – షిర్డీ , ముంబై -షోలాపూర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ , మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే , డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముంబై నుంచి షిర్డీ వెళ్లే భక్తులు అదే రోజు దర్శనం చేసుకొని తిరిగి రావడానికి ఈ రైలు ఉపయోగపడుతుంది. ముంబై నుంచి షోలాపూర్‌కు ఆరుగంటల్లో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ చేరుకుంటుంది. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో రైల్వే రంగంలో కొత్త విప్లవం వచ్చిందన్నారు ప్రధాని మోదీ. 10వ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఆధునిక భారతానికి నిదర్శనమన్నారు.

కాగా, ఇప్పటి వరకు దేశంలో 8 వందే భారత్‌ రైళ్లు అందుబాటులోకి రాగా, 9వ వందే భారత్‌ రైలును ముంబై నుంచి సోలాపూర్‌ మధ్య ప్రారంభిస్తారు. దీని ద్వారా ముం-సోలాపూర్‌ మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. అలాగే 10వ వందే భారత్‌ రైలు ముంబై-సాయినగర్‌ షిరిడీ రూట్‌లో ప్రారంభం కానుంది. ముంబై-సోలాపూర్‌ మధ్య నడిచే రైలు సోలాపూర్‌లోని సిద్ధేశ్వర్‌ వచ్చే ప్రయాణికులు అక్కల్‌కోట్‌, తుల్జాపూర్‌, పండరిపూర్‌, అలండి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. ఇక ముంబ- షిరిడీ వెళ్లే ప్రయాణికులు నాసిక్‌, త్రయంబకేశ్వర్‌, సాయినగర్‌ షిరిడీ, శనిశిగ్నాపూర్‌ వెళ్లేవారికి ఈ సేవలు అందుకోవచ్చు. అయితే మహారాష్ట్రలో ఇప్పటికే రెండు వందే భారత్‌ రైళ్లు అందుబాటులోకి ఉండగా, తాజాగా మరో రెండు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

వందే భారత్‌ నడిచే సమయం:

ఈ వందే భారత్‌ రైలు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినల్‌లో మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభం అవుతాయి. ముంబై-సోలాపూర్‌ రైలు 400 కిలోమీటర్ల దూరానికి కేవలం 6.35 గంటల్లో చేరుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇక ముంబై- షిరిడీ మధ్య 340 కిలోమీటర్లు. ఈ దూరాన్ని చేరుకోవాలంటే 5.24 గంటల సమయం పడుతుంది. అయితే త్వరలో మరిన్ని రూట్లలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్‌- తిరుపతి, సికింద్రాబాద్‌-బెంగళూరు, సికింద్రాబాద్‌-పూణె రూట్లలో వందే భారత్‌ రైళ్లు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం

న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..
వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..
బజాజ్ ప్లాటినా.. హోండా షైన్.. ఇందులో ఏది బెటర్‌.. ఎంత మైలేజీ!
బజాజ్ ప్లాటినా.. హోండా షైన్.. ఇందులో ఏది బెటర్‌.. ఎంత మైలేజీ!
భారీగా జీఎస్టీ వసూళ్లు.. గత ఏడాది కం టే ఎక్కువే.. ఎంతో తెలుసా..?
భారీగా జీఎస్టీ వసూళ్లు.. గత ఏడాది కం టే ఎక్కువే.. ఎంతో తెలుసా..?
ఆడ తోడుకు ఎంట్రీ.. కట్ చేస్తే.. బోనులో దర్శనమిచ్చింది
ఆడ తోడుకు ఎంట్రీ.. కట్ చేస్తే.. బోనులో దర్శనమిచ్చింది
400 ఏళ్ల నాటి వింత ప్రతిభ...ఎముకలతో అందమైన ఆభరణాల తయారీ.. ఎక్కడంట
400 ఏళ్ల నాటి వింత ప్రతిభ...ఎముకలతో అందమైన ఆభరణాల తయారీ.. ఎక్కడంట
బాలయ్య టాక్‌షోలో రామ్ చరణ్ ధరించిన బ్లాక్ హుడీ ధరెంతో తెలుసా?
బాలయ్య టాక్‌షోలో రామ్ చరణ్ ధరించిన బ్లాక్ హుడీ ధరెంతో తెలుసా?
HP Laptops: హెచ్‌పీ నుంచి AI ఫీచర్‌తో రెండు సూపర్‌ ల్యాప్‌టాప్స్‌
HP Laptops: హెచ్‌పీ నుంచి AI ఫీచర్‌తో రెండు సూపర్‌ ల్యాప్‌టాప్స్‌
అక్కడా గేమ్ ఛేంజర్‌కు గ్రౌండ్ క్లియర్..!
అక్కడా గేమ్ ఛేంజర్‌కు గ్రౌండ్ క్లియర్..!
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..