Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chennai: సినిమా స్టైల్ లో భారీ చోరీ.. రాత్రికి రాత్రే పక్కా ప్లాన్.. కన్నమేసి కనిపించిందంతా ఊడ్చేశారు..

దొంగలు రోజురోజుకీ తెలివి మీరిపోతున్నారు. ఒకటికి రెండుసార్లు పక్కాగా రెక్కీ చేసుకుని మరీ చోరీలకు పాల్పడుతున్నారు. చెన్నై శివారులోని నగల షోరూమ్‌లో జరిగిన ఘరానా చోరీ ఇప్పుడు అందర్నీ షాక్‌కు..

Chennai: సినిమా స్టైల్ లో భారీ చోరీ.. రాత్రికి రాత్రే పక్కా ప్లాన్.. కన్నమేసి కనిపించిందంతా ఊడ్చేశారు..
Gold Shop Robbery
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 10, 2023 | 5:23 PM

దొంగలు రోజురోజుకీ తెలివి మీరిపోతున్నారు. ఒకటికి రెండుసార్లు పక్కాగా రెక్కీ చేసుకుని మరీ చోరీలకు పాల్పడుతున్నారు. చెన్నై శివారులోని నగల షోరూమ్‌లో జరిగిన ఘరానా చోరీ ఇప్పుడు అందర్నీ షాక్‌కు గురి చేస్తోంది. పక్కాగా సినిమా స్టైల్లో ప్లాన్‌ చేసిన దొంగల ముఠా.. రాత్రికి రాత్రి పథకాన్ని అమలు చేసింది. షోరూమ్‌లో నుంచి 10 కిలోల బంగారం, కోటి రూపాయల వజ్రాలు ఎత్తుకెళ్లిపోయారు. చెన్నై శివారులోని పెరంబూరులో ఉంది ఈ జేఎల్ గోల్డ్ ప్యాలస్‌. ఈ షోరూమ్ పక్కనే ఓ ఆలయం ఉంది. దీన్ని ఉపయోగించుకుని ఆ గుడి వెనుక నుంచి షోరూమ్‌లోకి కన్నం వేశారు. తర్వాత మొత్తం ఊడ్చుకుని వెళ్లిపోయారు.

చెన్నైలోని పెరంబూర్​లోని పేపర్​మిల్స్ రోడ్డులో శ్రీధర్.. తన కుటుంబంతో కలిసి రెండస్థుల భవనంలో నివాసం ఉంటున్నాడు. ఫస్ట్ ఫ్లోర్ లో ఎనిమిది సంవత్సరాలుగా జేఎల్ గోల్డ్ ప్యాలెస్ పేరుతో బంగారు నగల దుకాణాన్ని నడుపుతున్నాడు. ఎప్పటిలాగే గురువారం రాత్రి నగల దుకాణాన్ని మూసివేశాడు. అయితే శుక్రవారం ఉదయం షాప్ తెరిచేందుకు శ్రీధర్ తన షాపునకు వచ్చి చూసేసరికి షాక్​కు గురయ్యాడు.

దుకాణ షట్టర్​ను గుర్తుతెలియని దుండగులు వెల్డింగు మిషన్​తో కత్తిరించి దోపిడీ చేశారు. తొమ్మిది కిలోల బంగారం, రూ.20 లక్షలు విలువచేసే వజ్రాలు ఎత్తుకెళ్లారు. భవనంలోని సీసీటీవీ హార్డ్​ డిస్క్​ను కూడా తీసుకువెళ్లిపోయారు. ఈ ఘటనపై దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం