
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం భోపాల్‌లోని రాణి కమలపాటి స్టేషన్ నుండి ఐదు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో రెండు రైళ్లను ప్రత్యక్షంగా ప్రారంభించగా.. మరో మూడు రైళ్లను వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కాగా బెంగళూరు-హుబ్లీ బాలాసోర్ ప్రమాదం తర్వాత తొలిసారిగా ఐదు వందే భారత్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రారంభమైన వందే భారత్ రైళ్లు దేశంలోని 6 రాష్ట్రాలను కలుపుతాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, బీహార్, ఝార్ఖండ్‌తో కనెక్టివిటీని కలిగి ఉంటాయి. ఇక దేశంలో ఇప్పటివరకు మొత్తం 23 వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రాగా, బీహార్, జార్ఖండ్, గోవాలో తొలిసారిగా వందే భారత్ రైలు కూతపెట్టనుంది. కాగా వచ్చే ఏడాదిలోగా దేశంలో 75 వందేభారత్ రైళ్లు నడపనున్నట్లు గత ఏడాది ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
భోపాల్-ఇండోర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మధ్యప్రదేశ్‌లోని రెండు ముఖ్యమైన నగరాలను కలుపుతోంది. వందే భారత్ రైలు కారణంగా ఈ ప్రాంతాలలో సాంస్కృతిక, పర్యాటక ప్రదేశాల కనెక్టివిటీ మెరుగుపడుతుంది. ఇక భోపాల్-జబల్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జబల్‌పూర్ నుండి భోపాల్‌ను కలుపుతుంది. దీనివల్ల పర్యాటక ప్రాంతాలకు కూడా ప్రయోజనం కలుగుతుంది. ఇక రాంచీ-పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు మొదటి వందే భారత్ రైలు కావడం విశేషం. పాట్నా, రాంచీ నగరాల మధ్య కనెక్టివిటీని పెంచే ఈ రైలు పర్యాటకులు, విద్యార్థులు మరియు వ్యాపారవేత్తలకు వరంగా మారనుంది. ధార్వాడ్-బెంగళూరు వందే భారత్ కర్ణాటక-ధార్వాడ్ మరియు హుబ్లీలోని ముఖ్యమైన నగరాలను రాష్ట్ర రాజధాని బెంగళూరుతో కలుపుతుంది. దీని వల్ల ఈ ప్రాంత పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారులు తదితరులకు ఎంతో మేలు జరుగుతుంది. గోవా-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గోవా రాష్ట్రంలో పట్టాలెక్కిన మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మొదలై గోవాలోని మడ్‌గావ్ స్టేషన్ వరకు నడుస్తుంది. గోవా, మహారాష్ట్రల మధ్య పర్యాటకానికి ఈ ఎక్స్ ప్రెస్ మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందంటున్నారు.
Madhya Pradesh: PM Modi flags off 5 Vande Bharat Express trains
Read @ANI Story | https://t.co/9MpOKds51I#PMModi #VandeBharatExpress #MadhyaPradesh #RaniKamalapatiJabalpur #AshwiniVaishnaw pic.twitter.com/RBl4c7tSe4
— ANI Digital (@ani_digital) June 27, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..