PM Modi: జన్ నాయక్‌కు భారతరత్న ప్రకటించినందుకు సంతోషిస్తున్నా.. ప్రధాని మోదీ కీలక ట్వీట్..

Karpoori Thakur Award Bharat Ratna: స్వాతంత్ర్య సమరయోధుడు, జన నాయక్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు అరుదైన గౌరవం దక్కింది. వరించింది. కర్పూరీ ఠాకూర్ శతజయంతి వేళ భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇచ్చి గౌరవించింది. కర్పూరి ఠాకూర్ 1924 జనవరి 24న బిహార్‌లోని సమస్తీపూర్‌ జిల్లాలో జన్మించారు.

PM Modi: జన్ నాయక్‌కు భారతరత్న ప్రకటించినందుకు సంతోషిస్తున్నా.. ప్రధాని మోదీ కీలక ట్వీట్..
PM Modi - Karpoori Thakur
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 23, 2024 | 8:56 PM

Karpoori Thakur Award Bharat Ratna: స్వాతంత్ర్య సమరయోధుడు, జన నాయక్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు అరుదైన గౌరవం దక్కింది. వరించింది. కర్పూరీ ఠాకూర్ శతజయంతి వేళ భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇచ్చి గౌరవించింది. కర్పూరి ఠాకూర్ 1924 జనవరి 24న బిహార్‌లోని సమస్తీపూర్‌ జిల్లాలో జన్మించారు. 1988 ఫిబ్రవరి 17న కన్నుమూశారు. జననేత ‘జననాయక్‌’గా ప్రసిద్ధిగాంచిన కర్పూరి ఠాకూర్‌.. డిసెంబరు 1970 నుంచి జూన్‌ 1971 వరకు, డిసెంబరు 1977 నుంచి ఏప్రిల్‌ 1979 వరకు రెండు సార్లు బీహార్‌ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఠాకూర్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఉపాధ్యాయుడిగా, రాజకీయవేత్తగా సేవలందించారు. అయితే, కర్పూరీ ఠాకూర్ శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి భవన్ ఈ విషయాన్ని ప్రకటించింది.

కాగా.. జన నాయక్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న పురస్కారం ప్రకటించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఆయనకు భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని నిర్ణయించినందుకు సంతోషిస్తున్నానంటూ ప్రధాని మోదీ ఈ మేరకు ఎక్స్ లో పంచుకున్నారు.

‘‘సాంఘిక, సామాజిక వేత్త, జన్ నాయక్.. కర్పూరి ఠాకూర్ జీ.. శతజయంతి జరుపుకుంటున్న తరుణంలో భారత ప్రభుత్వం భారతరత్న ప్రదానం చేయాలని నిర్ణయించినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు అట్టడుగు వర్గాలకు ఛాంపియన్‌గా.. సమానత్వం, సాధికారత దృఢంగా ఆయన చేసిన నిరంతర ప్రయత్నాలకు నిదర్శనం.. అణగారిన వర్గాలను అగ్రస్థానానికి తీసుకురావాలన్న ఆయన అచంచలమైన నిబద్ధత, అతని దార్శనిక నాయకత్వం భారతదేశ సామాజిక-రాజకీయ వ్యవస్థపై చెరగని ముద్ర వేసింది. ఈ అవార్డు అతని విశేషమైన సేవలను గౌరవించడమే కాకుండా మరింత న్యాయమైన, సమానమైన సమాజాన్ని రూపొందించేందుకు అతని ముందు చూపును కొనసాగించడానికి మాకు స్ఫూర్తినిస్తుంది.’’ అంటూ ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..