Odisha Train Accident: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ప్రధాని మోడీ ఫోన్.. సహాయక చర్యలపై ఆరా

| Edited By: Ram Naramaneni

Jun 04, 2023 | 2:19 PM

ఒడిశాలోని బాలాసోర్‌లో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైన ప్రదేశంలో సాధారణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు కేంద్రమంత్రులతో పాటు భారీ సంఖ్యలో అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారు. కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్‌, మాండవీయ, ధర్మేంద్ర ప్రదాన్‌ లు బాలాసోర్‌లోనే ఉంటూ పనుల పురోగతిని చూస్తున్నారు.

Odisha Train Accident: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ప్రధాని మోడీ ఫోన్.. సహాయక చర్యలపై ఆరా
Pm Modi, Ashwini Vaishnav
Follow us on

ఒడిశాలోని బాలాసోర్‌లో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైన ప్రదేశంలో సాధారణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు కేంద్రమంత్రులతో పాటు భారీ సంఖ్యలో అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారు. కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్‌, మాండవీయ, ధర్మేంద్ర ప్రదాన్‌ లు బాలాసోర్‌లోనే ఉంటూ పనుల పురోగతిని చూస్తున్నారు. కాగా ఘటనా స్థలంలోని పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈక్రమంలో కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మోడీ చేశారు మోడీ. కోరమాండల్ రైల్వే ప్రమాద ఘటనలో కొనసాగుతోన్న సహయక చర్యలపై ఆరా తీశారు. ప్రమాదానికి గురైన ట్రాక్ మరమ్మత్తులు, ట్రాక్ పునరుద్ధరణ పనుల గురించి మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను అడిగి తెలుసుకున్నారు. ట్రాక్‌ మరమ్మతు పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని మంత్రికి ప్రధాని మోడీ సూచించారు. కాగా ఒడిశా రైలు ప్రమాద ఘటనపై నిన్న (శనివారం) దేశ రాజధాని ఢిల్లీలో అత్యవసర సమావేశం నిర్వహించారు ప్రధాని మోడీ. అనంతరం ఒడిశాకు వెళ్లి ప్రమాద స్థలిని పరిశీలించారు. అనంతరం ఒడిశాలోని కటక్‌ ఆస్పత్రికి వెళ్లి ప్రమాద ఘటనలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించారు. అండగా ఉంటామంటూ భరోసా నిచ్చారు.

 

ఇవి కూడా చదవండి

కాగా ప్రమాద స్థలంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు భారీ సంఖ్యలో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. దాదాపు 1,000 మంది రైల్వే సిబ్బంది,
ఏడు ప్రొక్లెయినర్లు, 6 భారీ క్రేన్లతో వెయ్యి మందికిపైగా కార్మికులు శ్రమిస్తున్నారు. రెండు యాక్సిడెంట్‌ రిలీఫ్‌ ట్రైన్స్‌ సహాయంతో ఈ పనులు సాగుతున్నాయి. బాలాసోర్‌లోనే ఉంటూ ట్రాక్‌ పునరుద్ధరణ పనుల్ని దగ్గరుంచి పర్యవేక్షిస్తున్నారు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌. కాగా యాక్సిడెంట్‌ స్పాట్‌లో రెస్క్యూ ఆపరేషన్స్‌ కంప్లీటైనట్టు ప్రకటించారు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌. మృతదేహాన్నింటినీ ఇప్పటికే తరలించినట్టు పేర్కొన్నారు. వీలైనంత వరకు వేగంగా బాలాసోర్‌లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఇక్కడ 288 మృతదేహాలను వెలికి తీయగా.. 1,100 మంది గాయపడినట్లు గుర్తించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.