PM Modi: దేశవ్యాప్తంలో వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి.. నేడు ఉన్నత అధికారులతో ప్రధాని మోడీ సమావేశం..

|

Dec 23, 2021 | 7:21 AM

Omicron-PM Modi: కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వైరస్ సంక్రమణ వ్యాప్తితో మొత్తం ప్రపంచం వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో ఒమిక్రాన్ గురించి..

PM Modi: దేశవ్యాప్తంలో వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి.. నేడు ఉన్నత అధికారులతో ప్రధాని మోడీ సమావేశం..
Follow us on

Omicron-PM Modi: కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వైరస్ సంక్రమణ వ్యాప్తితో మొత్తం ప్రపంచం వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో ఒమిక్రాన్ గురించి జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ  అన్ని దేశాల ప్రభుత్వాలు నిరంతరం హెచ్చరిస్తునే ఉంది. ఇదిలా ఉండగా, దేశ కోవిడ్-19 పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారంఅధికారులతో సమావేశం కానున్నారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో, భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు వీలుగా ఒమిక్రాన్ విషయం లో ఎలా  వ్యవహరించాలనేది అధికారులకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేయనున్నారు.  అధికారులతో ప్రధాని మోడీ ఈ భేటీలో దేశంలో కరోనా కేసులు పెరుగుదల, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై చర్చించనున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసుల దృష్ట్యా చర్యలు చేపట్టింది.

దేశవ్యాప్తంగా మహమ్మారి పరిస్థితిని మోడీ సమీక్షిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి.  భారతదేశంలోని 16 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలో ఇప్పటివరకు 248 ఒమిక్రాన్ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. 90 మందికి బాధితులు కోలుకున్నారని చెప్పారు. అయితే ఇప్పటికే అనేక దేశాల్లో వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌లను ప్రభుత్వం అనుమతించాలని  డిమాండ్ తెరపైకి వస్తోంది.

COVID-19 చికిత్సకు అవసరమైన అవసరమైన మందుల బఫర్ స్టాక్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుందని, తద్వారా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు, దేశం ఎటువంటి కొరతను ఎదుర్కోకుండా ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఆక్సిజన్ సరఫరా కొరతను నివారించడంతోపాటు ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వెంటిలేటర్ల కోసం పారదర్శకమైన వ్యవస్థను రూపొందించామన్నారు.

మంగళవారం నాటికి దేశంలో 200 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అందులో 77 మంది రోగులు ఇప్పటివరకు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒమిక్రాన్ కేసులలో మహారాష్ట్ర 65 కేసులతో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీలో 54, తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14 కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.దేశవ్యాప్త ఇమ్యునైజేషన్ డ్రైవ్‌లో భాగంగా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచిత కోవిడ్ వ్యాక్సిన్‌లను అందించడం ద్వారా పూర్తి సహాయాన్ని అందిస్తోంది. కేంద్రం ఇప్పటివరకు 147 కోట్ల కంటే ఎక్కువ (1,47,05,13,635) వ్యాక్సిన్‌లను రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలకు అందుబాటులో ఉంచింది

Also Read:

RBI: జనవరి 1 నుంచి ఆర్‌బీఐ కొత్త రూల్స్‌ అమలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..