AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీ పుట్టినరోజు.. ధర్మేంద్ర ప్రధాన్ ప్రత్యేక పూజలు.. సింధియా స్పెషల్ విషెస్..

ప్రధాని మోదీ బర్త్ డే సందర్భంగా దేశ నలుమూలల నుంచి ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అటు 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న చారిత్రక సందర్భంలో.. ఒడిశాలోని ప్రముఖ సమలేశ్వరి అమ్మవారి ఆలయంలో ధర్మేంద్ర ప్రధాన్ ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వెలిగించారు. అదేవిధంగా మహాన్ ఆర్యమన్ సింధియా మోదీకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని మోదీ పుట్టినరోజు.. ధర్మేంద్ర ప్రధాన్ ప్రత్యేక పూజలు.. సింధియా స్పెషల్ విషెస్..
Pm Narendra Modi Birthday
Krishna S
|

Updated on: Sep 17, 2026 | 3:43 PM

Share

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని బర్త్ డేను పురస్కరించుకుని కేంద్ర మాజీ మంత్రి , ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సంబల్‌పూర్‌లోని మా సమలేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి, ప్రధాని మోదీ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుదీర్ఘ కాలం ప్రజాసేవలో కొనసాగాలని, సుసంపన్నమైన జీవితం గడపాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు పాల్గొని దీపాలు వెలిగించి ప్రార్థనలు చేశారు.

వీడియో  చూడండి..

Follow Us