ఈ వైరల్ జ్యూస్‌తో నిజంగానే జుట్టు పెరుగుతుందా? వాస్తవమేంటి?
15 Sep 2026
Anand T
ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసిన ఒకటే చిట్కా.. ఉసిరి - కీరదోస జ్యూస్‌తో హెయిర్ గ్రోత్ అవుతుందని.. మీరి ఇది ఎంత వరకు నిజం.. దీని వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం.
వైరల్ జ్యూస్
ఉసిరి, కీరదోస రసంతో ఈజీగా జుట్టు పెరుగుతుందని ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ తన ఇన్‌స్టాలో ఒక పోస్ట్ చేశారు. ఆ జ్యూస్ ఎలా తయారు చేయాలో కూడా అతను చెప్పాడు.
వైరల్ రెసిపీ
ఈ జ్యూస్ తయారు చేసేందుకు కీరదోసకాయ, ఉసిరికాయలు, కరివేపాకు, అల్లం, నల్ల ఉప్పు, నీరు, కొద్దిగా తేనె ఉంటే సరిపోతుందని తెలిపారు.
జ్యూస్‌కు కావాల్సినవి ఏంటి?
ఈ జ్యూస్ తయారు చేసేందుకు మొదట ఉసిరి, కీరదోస, కరివేపాకు, అల్లం మిశ్రమాన్ని గ్రైండ్ చేసి వడకట్టాలి. రుచి కోసం కొద్దిగా నల్ల ఉప్పు, తేనె కలుపుకోవాలి.
తయారీ విధానం
జ్యూస్ వడకట్టినప్పుడూ మిగిలిన గుజ్జును జుట్టుకు మొత్తం ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి.. ఇలా చేస్తే వెంట్రుకలు పట్టులా మెరుస్తాయని ఆయన తెలిపారు.
గుజ్జును పారేయకండి!
ఈ జ్యూస్‌లో వాడే ఉసిరిలో విటమిన్ సి ఉంటుందని.. ఇది జుట్టును బలంగా మార్చి, కుదుళ్ల నిర్మాణానికి ఎంతో మేలు చేస్తుందన్నారు.
విటమిన్ సి
ఈ ఉసిరి, కీరదోసల్లోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లు దెబ్బతినకుండా కాపాడతాయని తెలిపారు.
రక్షణ కవచం
అయితే ఈ జ్యూస్ జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుంది కానీ, రిజల్స్ అంత త్వరగా రావని నిపుణులు చెబుతున్నారు. జుట్టు పెరగాలంటే.. ఈ జ్యూస్‌తో పాటు సరైన జీవనశైలి కూడా ముఖ్యమని తెలిపారు.