PM-Kisan Samman Nidhi: ఈరోజు ఆగష్టు 28.. ఈనెల పూర్తవడానికి మరో మూడు రోజులు మాత్రమే ఉంది. జనరల్ గా ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. కాబట్టి.. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి.. మార్చి నెలాఖరుకు ఎంతో ప్రాధాన్యముంటుంది. మరి ఆగష్టు నెలఖారుతో ఏం సంబంధం అనుకుంటున్నారా.. కొన్ని ముఖ్యమైన ఆర్థిక వ్యవహరాలకు సంబంధించి KYC పూర్తి చేయడం తప్పనిసరి.. ఈనెలఖారుకు పూర్తిచేయాల్సిన పనులు ఏమిటనుకుంటున్నారా.. ఇదిగో తెలుసుకోండి.. రైతులకు ఏడాదికి రూ.6,000 పెట్టుబడి సహాయాన్ని కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అందిస్తోంది. ఈపథకం లబ్ధిదారులైతే KYC కంప్లీట్ చేసుకోవడానికి ఈనెలఖారుతో గడువు ముగుస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఖాతాదారులకు ఓ ముఖ్యమైన అలర్ట్ ఉంది.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి: మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులైతే వీలైనంత త్వరగా e-KYCని పూర్తి చేయండి. ఈ పథకం యెుక్క KYCని పూర్తి చేయడానికి ప్రభుత్వం విధించిన చివరి గడువు ఆగష్టు 31వ తేదీతో ముగుస్తుంది. e-KYC పూర్తి చేయకపోతే తదుపరి విడతకు సంబంధించిన నగదు ఖాతాలో జమకాదు. KYC పూర్తి చేయడానికి ఇంతకుముందు ప్రభుత్వం విధించిన గడువు ఈఏడాది జులై 31తో ముగిసింది. అయితే ఇంకా చాలా మంది లబ్ధిదారులు KYC కంప్లీట్ చేయలేదనే ఉద్దేశంతో ఆగడువును ఆగష్టు 31వరకు పొడిగించారు. ఇప్పటివరకు KYC ప్రక్రియను పూర్తి చేయని వారికి ఈపథకం 11వ విడత ప్రయోజనం అందలేదు. ఈ పథకం యొక్క 12వ విడత నగదును సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులు అయితే ఆగస్టు 31లోపు మీ ఖాతా KYCని తప్పనిసరిగా కలిగి ఉండాలి. లేకపోతే, బ్యాంక్ మీ ఖాతాను హోల్డ్‌లో ఉంచుతారు. బ్యాంక్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఈ విషయాన్ని తెలయజేసింది. ఖాతా సంబంధించిన KYC ప్రక్రియను 31 మార్చి 2022 నాటికి పూర్తి చేయని కస్టమర్‌లు ఆగస్టు 31, 2022లోపు చేయాలి, లేకుంటే మీ ఖాతా డీయాక్టివేట్ చేయబడుతుందని బ్యాంకు అధికారికంగా ప్రకటించింది.
ITR వెరిఫికేషన్‌ను పూర్తి చేయండి: మీరు జూలై 31, 2022 తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసి ఉంటే, మీరు దాని వెరిఫికేషన్‌ను నెలలోగా అంటే 30 రోజుల్లో పూర్తి చేయాలి. అలాగే జూలై 31 గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేసిన వారు దాని వెరిఫికేషన్‌ను కేవలం 30 రోజుల లోపు మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. మీరు రిటర్న్‌ను ఆగస్టు 1న ఫైల్ చేసి ఉంటే, మీ వెరిఫికేషన్ గడువు ఆగస్ట్ 31తో ముగుస్తుంది. ధృవీకరణ లేకుంటే, మీ ITR రిటర్న్ పూర్తయినట్లు పరిగణించబడదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..