PM Kisan Scheme: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ స్కీం నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్..

PM Kisan 10th Installment: ప్రధానమంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి కింద కేంద్రం రైతుల‌కు మూడు విడతల్లో ఏటా రూ.6 వేలు న‌గ‌దు జమ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ఏడాది

PM Kisan Scheme: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ స్కీం నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్..
Pm Kisan Scheme

Updated on: Nov 23, 2021 | 8:47 PM

PM Kisan 10th Installment: ప్రధానమంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి కింద కేంద్రం రైతుల‌కు మూడు విడతల్లో ఏటా రూ.6 వేలు న‌గ‌దు జమ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో మంజూరు చేయనున్న కిసాన్ నిధి కింద సుమారు 22 వేల కోట్లు రిలీజ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. డిసెంబ‌ర్‌-మార్చ్ విడత నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. కిసాన్ స‌మ్మాన్ నిధి కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సుమారు 1.57 లక్షల కోట్లను కేటాయించింది. డిసెంబ‌ర్ 15 నుంచి 25 మ‌ధ్య 10 విడత నిధులను రిలీజ్ చేసేందుకు కేంద్రం సమాయత్తమైందని సంబంధిత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కాగా.. ఈ సారి కిసాన్‌ పథకంలో ప‌శ్చిమ బెంగాల్‌లోని 15 లక్షల మంది రైతుల్ని కూడా క‌ల‌ప‌నున్నారు. దీంతో ఈ స్కీమ్ కింద ల‌బ్ధి పొందుతున్న రైతుల సంఖ్య 11కోట్లు దాటనుందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి పీఎం కిసాన్ పథకానికి 65వేల కోట్ల బడ్జెట్‌ను ఉపయోగించనున్నారు. ఈ సారి నుంచి బెంగాల్ రైతులను కూడా కలపనుండటంతో.. నిధుల సంఖ్య మరింత పెరిగే సూచనలున్నాయని పేర్కొంటున్నారు. కాగా.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఇప్పట్లో మర్చడం లేదని కేంద్రం ఇటీవల స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.

కాగా.. కేంద్ర ప్రభుత్వం ఏటా రైతులకు మూడు విడతల్లో నగదును జమ చేస్తూ వస్తోంది. మూడు త్రైమాసికాల్లో రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాలో నగదు జమ అవుతుంది.

Also Read:

Winter Diet: వింటర్ సీజన్‌లో ఈ ఐదు డ్రింక్స్ తాగితే బోలడన్ని లాభాలు.. అవేంటంటే..

చలికాలంలో ఈ బ్రేక్‏పాస్ట్స్ తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. అవేంటంటే..