దేశ రైతన్నలకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. పీఎం కిసాన్ పధకం(PM Kisan) కింద 9వ విడత నిధులు సుమారు రూ. 19,500 కోట్లను పీఎం నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. ఈ పథకం ద్వారా 9.75 కోట్ల రైతు కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.
ఈ స్కీం కింద అర్హులైన లబ్దిదారులకు ప్రతీ సంవత్సరం రూ. 6 వేలు అందుతాయి. ఈ మొత్తాన్ని నాలుగు నెలల వ్యవధిలో మూడుసార్లు రూ. 2 వేలు చొప్పున ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 1.38 లక్షల కోట్ల రైతు కుటుంబాలకు బదిలీ అయ్యాయి.
మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా..
- మొదటిగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి హోమ్‌పేజీ(pmkisan.gov.in)ని సందర్శించండి.
- ఆ తర్వాత “beneficiary status”ట్యాబ్‌పై క్లిక్ చేయండి.’
- కొత్త విండోలో, ఆధార్, అకౌంట్ లేదా మొబైల్ నెంబర్‌ను ఎంపిక చేయండి.
- నెక్స్ట్ ‘Click Data’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.. పూర్తి డేటాను పొందండి.
- ఒకవేళ అది కాకపోతే కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించే ‘పీఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్’ డైరెక్ట్ లింక్‌పై నొక్కండి
మరిన్ని ఇక్కడ చూడండి: గరుడ పురాణం : జీవితంలో ఈ 4 పరిస్థితులు దుఖాన్ని మిగుల్చుతాయి..! అప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలంటే..?
Tribes: నల్లమలలో ఆత్మహత్య చేసుకుంటాం.. గ్రామ దేవతలకు మొక్కి అడవిలోకి వెళ్లిన ముగ్గురు చెంచు రైతులు