PM-CARES For Children: కోవిడ్-19తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం కేంద్రం కొత్త పథకం.. పీఎం కేర్స్​ నుంచి రూ.10 లక్షలు.. ఇంకా

|

May 29, 2021 | 6:57 PM

కోవిడ్-19తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం కేంద్రం కొత్త పథకం ప్రవేశ‌పెట్టింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలవాలని నిర్ణయించింది.

PM-CARES For Children: కోవిడ్-19తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం కేంద్రం కొత్త పథకం.. పీఎం కేర్స్​ నుంచి రూ.10 లక్షలు.. ఇంకా
Pm Modi
Follow us on

కోవిడ్-19తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం కేంద్రం కొత్త పథకం ప్రవేశ‌పెట్టింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలవాలని నిర్ణయించింది. అనాథ‌ల‌యిన‌ చిన్నారులకు ఉచిత విద్య అందించాల‌ని డిసైడ‌య్యింది. 18 ఏళ్లు నిండాక నెలవారీ స్టైపెండ్, 23 ఏళ్లు నిండాక రూ. 10 లక్షలు పీఎం-కేర్స్ నుంచి ఇచ్చేలా స్కీమ్ తీసుకువ‌చ్చింది. ఈ మేర‌కు ‘పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రెన్​’ ద్వారా సాయం అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉన్నత చదువుల కోసం రుణం, దానిపై వడ్డీ పీఎం-కేర్స్ నుంచి చెల్లించాల‌ని నిర్న‌యించారు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చేవరకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద రూ. 5 లక్షల విలువైన ఆరోగ్య బీమా ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఇందుకు పీఎం-కేర్స్ నుంచే ప్రీమియం చెల్లింపు ఉంటుంది. పిల్లలు దేశ భవిష్యత్తు అని, వారికి భద్రత, సహాయం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రధాని వెల్లడించారు అలాంటి చిన్నారుల భవిష్యత్తుపై భరోసా కల్పించడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

“ఒక సమాజంగా మన చిన్నారులను రక్షించుకోవటం ఒక బాధ్యత. వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. పిల్లలు భారత భవిష్యత్తును సూచిస్తారు. వారిని రక్షించుకునేందుకు మద్దతుగా నిలిచేందుకు అన్ని విధాల కృషి చేస్తాం” అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Also Read: కోళ్లను ముద్దు చేస్తున్నారా….. వాటి ద్వారా కొత్త ఇన్‌ఫెక్షన్.. సీడీసీ హెచ్చ‌రిక‌

బిర్యానీ ఆర్డ‌ర్ స‌రిగ్గా ఇవ్వ‌లేదంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేసిన నెటిజ‌న్.. మంత్రి రిప్లై భ‌లే ఫ‌న్నీ