ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో మళ్ళీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ …. థర్డ్ ఫ్రంట్ దిశగా మొదలైన అడుగులు ?

| Edited By: Anil kumar poka

Jun 21, 2021 | 3:00 PM

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోమవారం ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో మళ్ళీ భేటీ అయ్యారు. ఈ నెలలో వీరి మధ్య సమావేశం జరగడం ఇది రెండోసారి.. 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయేని ఎదుర్కోవడానికి తృతీయ

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో మళ్ళీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ .... థర్డ్ ఫ్రంట్ దిశగా మొదలైన అడుగులు ?
Pk Meet With Sharad Pawar In Delhi
Follow us on

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోమవారం ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో మళ్ళీ భేటీ అయ్యారు. ఈ నెలలో వీరి మధ్య సమావేశం జరగడం ఇది రెండోసారి.. 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయేని ఎదుర్కోవడానికి తృతీయ (థర్డ్) ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు సాగుతున్నాయనడానికి ఇది నిదర్శనమనే ఊహాగానాలు పుంజుకుంటున్నాయి. పవార్ తో తన సమావేశం రొటీన్ గానే జరిగిందని ప్రశాంత్ కిషోర్ ఆ తరువాత చెప్పారు. ఇంతకు మించి వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. మొదట ఈ నెల 12 న ముంబైలోని పవార్ నివాసంలో ఆయనను పీకే కలిశారు. ఆ రోజున ఇద్దరి మధ్య సుమారు 3 గంటలకు పైగా చర్చలు జరిగాయి. కాగా సోమవారం ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్, ఈ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ కూడా పాల్గొన్నారు. రోహిత్ కూడా శరద్ పవార్ మేనల్లుడే….రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి మరిన్ని ప్రతిపక్ష పార్టీలు చేతులు కలుపుతాయని.. ఆ నేపథ్యంలోనే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై చర్చలు ముమ్మరమవుతున్నాయని అంటున్నారు.

బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయానికి తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకె గెలుపునకు ప్రశాంత్ కిషోర్ కారకులయ్యారు. తన పొలిటికల్ టీమ్ తో ఎప్పటికప్పుడు తన స్ట్రాటజీ ని మారుస్తూ తనను నమ్మిన పార్టీలకు పూర్తి న్యాయం చేస్తున్నారు. ఈ వ్యూహకర్తపై ఇప్పుడు శరద్ పవార్ కూడా ఆధారపడుతున్నారా అని విశ్లేషకులు ప్రశ్నించుకుంటున్నారు. 2024 లో జరిగే ఎన్నికల్లో ఒకవేళ విపక్ష కూటమి అధికారంలోకి వచ్చిన పక్షంలో శరద్ పవార్ ప్రధాన మంత్రి అభ్యర్థి కావచ్చునని ఇదివరకే ఉహాగానాలు వచ్చాయి. అదే సమయంలో మమతా బెనర్జీ పేరు కూడా వినవచ్చింది.

మరిన్ని ఇక్కడ చూడండి: మూడంతస్తులు ఎక్కొచ్చి బెడ్ పై సీదతీరుతున్న ఎద్దు వైరల్ అవుతున్న వీడియో :Bull king climbed into 3-storey house video viral.

నలుగురూ కలిశారు ఓ గట్టి పట్టు పట్టారు…విందు కార్యక్రమంలో వధువు అల్ల‌రి.. అంద‌రూ ఫిదా: viral video.

త్రిభాషా చిత్రంగా శేఖర్ కమ్ముల ధనుష్ కాంబో..!ఊహకందని కంపోజిషన్స్‌లో కొత్తగా కనిపించబోతున్న సినిమా :Shekar kammula and dhanush video

Rajanikanth Video: అమెరికాకు పయనమైన రజనీకాంత్ భార్య తో కలిసి స్పెషల్ ప్లైట్ లో..వైద్య పరీక్షల కోసమేనా ?