Odisha Train Accident: రైలు ప్రమాదం ఘటనపై ఆయన నేతృత్వంలోనే విచారణ జరిపించాలి.. సుప్రీంకోర్టులో పిల్ దాఖలు

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 290 మందికి పైగా మృతిచెందారు. 1100 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన ఘటనపై సుప్రీకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ నిపుణులను ప్యానల్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రమాదంపై విచారణ జరపాలని కోరారు.

Odisha Train Accident: రైలు ప్రమాదం ఘటనపై ఆయన నేతృత్వంలోనే విచారణ జరిపించాలి.. సుప్రీంకోర్టులో పిల్ దాఖలు
Odisha Train Accident

Updated on: Jun 04, 2023 | 2:47 PM

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 290 మందికి పైగా మృతిచెందారు. 1100 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన ఘటనపై సుప్రీకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ నిపుణులను ప్యానల్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రమాదంపై విచారణ జరపాలని కోరారు. అలాగే ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని భారత రైల్వేలలో వెంటనే కవచ్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయవాది విశాల్‌ యివారీ పిటిషన్‌ దాఖలు చేశారు.

మరోవైపు ఈ రైలు ప్రమాదానికి జరగడానికి గల ముఖ్య కారణాలను గుర్తించామని తెలిపారు. బుధవారం నాటికి ప్రభావానికి గురైన ట్రాక్‌లను సాధారణ సేవల కోసం పునరుద్ధరిస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఇక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారి జాబితాను ఒడిశా ప్రభుత్వం మూడు వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేసింది. ఇప్పటికే ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ వెబ్‌సైట్లలో ప్రయాణికుల ఫొటోలు ఇతర వివరాలను కూడా పొందు పరిచామని ఒడిశా ప్రభుత్వం పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి