50 వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టండి.. ఆరునెలల్లో లక్ష రూపాయలు పొందండి. మీ ఇంట్లో ఉంటూ జస్ట్ ఫోన్ కాల్ చేసి లక్షలు సంపాదించండి. క్రిప్టోకరెన్సీ కొనండి. మీ సన్నిహితులతో కొనిపించండి. గూగుల్ ప్లాట్ ఫామ్ వేదికగా వచ్చే ఇలాంటి యాడ్స్‌ను అస్సలు నమ్మొద్దు. అపరిచితులే కాదు. మీ సమీప బంధువులు చెప్పినా.. నమ్మొద్దంటుంది కేంద్రప్రభుత్వం. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ఉన్న డబ్బును పోగొట్టుకోవద్దని హెచ్చరిస్తుంది.
నిరుద్యోగ యువత, గృహిణులు, విద్యార్థులు, పేదలను లక్ష్యంగా చేసుకొని పిగ్ బుచరింగ్ స్కామర్లు కోట్లు కాజేస్తున్నారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. పిగ్ బుచరింగ్ స్కామ్‌నే ఇన్వెస్ట్ మెంట్ స్కామ్ అని పిలుస్తారు. ప్రజలకు అధికలాభాల ఆశచూపి వారి దగ్గర డబ్బులు కాజేస్తారు. ఈ తరహా మోసాలను ముందుగానే గుర్తించి తక్షణమే చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ గూగుల్, ఫేస్‌బుక్ వంటి టెక్ సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ప్రజలను ముందుగానే హెచ్చరిస్తుంది.
ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే ప్రకటనలను నమ్మొద్దని కేంద్రం సూచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సైబర్ మోసాలు పెరిగిపోయాయి. దీంతో భారత ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. సెల్‌ఫోన్ ద్వారా, ప్రకటనల ద్వారా ప్రజలను జాగృత పరుస్తుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..