Is Govt giving Rs 25 lakh loan at Zero per cent interest for women? కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఎటువంటి గ్యారెంటీ లేకుండా మహిళలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.25 లక్షలు లోన్ ఇస్తున్నట్లు గత కొంత కాలంగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై పీఐబీ ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చింది. ఇది పూర్తిగా అవాస్తవమని, అటువంటి ప్రకటనలేవీ కేంద్రం జారీ చేయలేదని, వీటిని నమ్మి, ఫ్రాడ్స్ దురుద్ధేశ్యంతో పన్నే వలలో చిక్కుకుని మోసపోవద్దని సూచించింది. సదరు ఫేక్ ప్రకటన ప్రకారం.. ‘నారీ శక్తి యోజన’ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఎస్బీఐ బ్యాంకుల నుంచి రూ.25 లక్షలు గ్యారెంటీ, వడ్డీలేకుండా దేశంలోని మహిళలందరికీ మంజూరు చేస్తున్నారనేది సారాంశం. ఈ మేరకు కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియాల్లో ప్రచారం జరుగుతోంది. ఐతే ఇది పూర్తిగా ఫేక్ పథకమని, అటువంటి ప్రకటన ఏదీ కేంద్రం జారీ చేయలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్విటర్ ద్వారా వెల్లడించింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఇటువంటి నకిళీ లింక్‌లను ఎట్టిపరిస్థితిలో క్లిక్ చేయవద్దని PIB సూచించింది.
నకిలీ వార్తలను పీఐబీలో ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే..
మీ మొబైల్ ఫోన్లకు కూడా ఇలాంటి అనుమానాస్పద మేసేజ్‌లు ఏవైనా వస్తే.. అది నిజమో.. కాదో.. ఇలా చెక్ చేసుకోండి. అందుకు ముందుగా పీఐబీ అధికారిక వెబ్‌సైట్ https://factcheck.pib.gov.in లింక్ మెసేజ్‌ను పంపించాలి.
Some YouTube channels provide details related to various government schemes, which do not exist in actuality.
Beware! Don’t fall for content curated by fraudsters with malicious intent.
Follow these simple steps to counter such content. #PIBFacTree pic.twitter.com/VWB0PIf2B8
— PIB Fact Check (@PIBFactCheck) September 2, 2022
లేదా+918799711259 నంబర్‌కి WhatsApp ద్వారా అయినా మెసేజ్ పంపించవచ్చు. అలాగే ఈ మెయిల్‌కు కూడా pibfactcheck@gmail.comకి కూడా పంపవచ్చు. దీనితోపాటు నకిలీ వార్తలకు సంబంధించిన వాస్తవాలను ఎప్పటికప్పుడు https://pib.gov.inలో కూడా చెక్ చేసుకోవచ్చు.