Fact Check : కొవిడ్ రిలీఫ్ కింద ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రూ.4 వేలు అందిస్తుందా..! అసలు విషయం ఏంటో తెలుసుకోండి..

|

Jul 03, 2021 | 4:01 PM

PIB Fact Check : ప్రతిరోజూ వివిధ రకాల విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. వాటిలో కొన్ని వాదనలు పూర్తిగా నిరాధారమైనవి.

Fact Check : కొవిడ్ రిలీఫ్ కింద ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రూ.4 వేలు అందిస్తుందా..! అసలు విషయం ఏంటో తెలుసుకోండి..
Pib Fact Check
Follow us on

Fact Check : ప్రతిరోజూ వివిధ రకాల విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. వాటిలో కొన్ని వాదనలు పూర్తిగా నిరాధారమైనవి. అంతేకాదు తప్పుదారి పట్టించేవిగా ఉంటాయి. ఇటీవల కోవిడ్ -19 సంక్షేమ పథకం కింద దేశంలోని ప్రతి పౌరుడికి భారత ప్రభుత్వం రూ .4 వేలు ఇస్తున్నట్లు ఒక మెస్సేజ్ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఇది నిజమేనా అనేది తెలుసుకుందాం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ఈ విషయంపై వివిరణ ఇచ్చింది. భారత ప్రభుత్వం కరోనా కేర్ ఫండ్ పథకం కింద అందరికీ రూ. 4,000 అందిస్తోందని వాట్సాప్‌ సందేశంలో పేర్కొంటున్నారు. ఇది పూర్తిగా అబద్ధమని ప్రభుత్వం అలాంటి పథకాన్ని ఏదీ ప్రారంభించలేదని స్పష్టం చేసింది. ట్విట్టర్ ద్వారా ప్రజలకు తెలియజేసింది.

దేశంలో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో జిడిపి 7.3 శాతం క్షీణించింది. గత త్రైమాసికంలో చాలా రంగాలు తెరిచిన తర్వాత కూడా కేవలం 1.6 శాతం వృద్ధిని మాత్రమే సాధించింది. అయినప్పటికీ కరోనా మహమ్మారి సమయంలో పౌరులకు, పేదలు, అణగారిన వర్గాల వారికి సహాయం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. దీపావళి వరకు 80 కోట్ల మంది పేద భారతీయులకు ఉచిత రేషన్‌ను అందిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇటీవల కొవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపట్టారు. వారి కుటుంబ సభ్యులకు పెన్షన్లు అందిస్తున్నారు. వారికి ఆర్థికంగా సాయపడేలా బీమా పరిహారాన్ని సరళీకృతం చేస్తున్నామని వివరించారు.

Srinivas Goud: తెలంగాణ నీళ్ల దోషుకుపోతే అడ్డం నిలబడతాం.. రాజకీయాలకీతతంగా రాష్ట్రం కోసం పోరాడుతాంః శ్రీనివాస్ గౌడ్

VIRAL PHOTOS : ఈ 5 ప్రదేశాల్లో గురత్వాకర్షణ శక్తి పనిచేయదు..! ఆ ప్రదేశాలు ఎక్కడున్నాయో తెలుసా..?

High Court: సమయానికి రాని అంబులెన్స్.. వైద్యం అందక బాలింత మృతి.. పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం!