Petrol Diesel Price Today: వరుస పెరుగుదలతో వాహన దారులను హడలెత్తించిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో మినహా పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 90 నుంచి రూ.100 మధ్య కొనసాగుతున్నాయి. ఇదిలాఉంటే.. బుధవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. చమురు సంస్థలు ధరల్లో ఎలాంటి సవరింపులూ చేయలేదు. మరి దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.79గా ఉండగా.. డీజిల్ ధర రూ. 88.86గా ఉంది. అటు వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.37గా ఉండగా.. డీజిల్ ధర రూ.88.44 వద్ద కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.22 కాగా డీజిల్ ధర రూ. 90.74గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.17గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.71 వద్ద కొనసాగుతోంది.
న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.90.99గా ఉండగా.. లీటర్ డీజిల్ రూ.81.30 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.40గా ఉండగా డీజిల్ రూ.88.42గా ఉంది. అలాగే చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.95గా ఉండగా.. డీజిల్ రూ.86.29 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.73 కాగా.. డీజిల్ ధర రూ. 85.93 వద్ద కొనసాగుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ గిఫ్ట్‌గా రూ. 10 వేలు.. వివరాలివే.!
జనసైనికుల స్ట్రాంగ్ వార్నింగ్.. రాపాకకు నో ఎంట్రీ బోర్డు.. వైరల్ అవుతున్న పిక్.!
బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. ఇవాళ ఏకంగా…