Air pollution: హడలెత్తిస్తున్న కాలుష్య రక్కసి.. కేంద్ర ప్రభుత్వోగులకు కీలక ఆదేశాలు

| Edited By: Janardhan Veluru

Nov 17, 2021 | 5:10 PM

కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ వీలైనంతగా ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించాలని..

Air pollution: హడలెత్తిస్తున్న కాలుష్య రక్కసి.. కేంద్ర ప్రభుత్వోగులకు కీలక ఆదేశాలు
Delhi Air Pollution
Follow us on

Delhi Air pollution: ఢిల్లీలో ప్రమాదఘంటికలు మోగిస్తున్న కాలుష్యానికి చెక్‌ పెట్టేదెలా..? ప్రజల ప్రాణాలకు పెను ప్రమాదంగా మారిన పొల్యూషన్‌ను నియంత్రించేదెలా..? ఈ అంశాలపైనే కసరత్తు చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. కాలుష్యం కట్టడికి ఏర్పాటుచేసిన అత్యవసర సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ వీలైనంతగా ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించాలని ఆదేశించారు. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఇప్పటికే  వాహనాలకట్టడి, విద్యుత్ ప్లాంట్లు, పరిశ్రమల మూసివేత, పంటవ్యర్థాల దహనం, ప్రత్యామ్నాయాలపై చర్చిస్తున్నారు. అలాగే నిర్మాణ పనులపై నిషేధం విధించాలని.. అన్ని సంస్థలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో పనిచేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఇప్పటికే కాలుష్యం కట్టడికి తీసుకున్న చర్యలను ఈ నెల చివరి వరకు పొడిగించింది ఢిల్లీ ప్రభుత్వం. వాహనాల నుంచి విడుదలయ్యే కాలుష్య నియంత్రణకు రెడ్‌ లైట్‌ ఆన్‌, గాడీ ఆఫ్‌ క్యాంపెయిన్‌..డిసెంబర్‌ 3 వరకు కొనసాగనుంది. పాఠశాలలు, కాలేజీలను కూడా మూసివేశారు. విపరీతంగా పెరిగిపోయిన కాలుష్యంతో ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలో ప్రజలు పలు రోగాల బారిన పడుతున్నారు. శ్వాస సంబంధిత సమ్యసలు, కళ్ల మంటలతో ఇబ్బంది పడుతున్నారు. గత రెండు వారాల్లో హాస్పిటల్స్‌కు వెళ్లే వారి సంఖ్య మరింత పెరిగిపోయింది.

దేశ రాజధానిలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధి మొత్తం విషపూరితంగా తయారైంది. కాలుష్యం తీవ్రత రోజురోజుకూ అధికమౌతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెరీ పూర్ కేటగిరీలోనే కొనసాగుతోంది. వాయు కాలుష్యం తీవ్రరూపం దాల్చడాన్ని సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌ను విధించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సైతం ఆదేశాలను జారీ చేశారు.

ఇవి కూడా చదవండి: AP Municipal Elections Results Live: ఏపీ మున్సిపల్ ఫలితాల్లో ఫ్యాన్ హవా.. నెల్లూరు, కుప్పం వైసీపీ వశం

PM Modi: తన మంత్రివర్గ సహచరుడు చేసిన మానవతా సహాయానికి అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ.. ఇంతకీ ఆ మంత్రి ఏం చేశారంటే..’