ఢిల్లీలో మరో దారుణ ఘటన.. ప్రభుత్వ పాఠశాలలో ఆయుధాలతో ప్రవేశించిన దుండగుడు..

|

Nov 15, 2022 | 10:14 PM

సమాచారం అందిన వెంటనే పాఠశాలలో చదువుతున్న పలువురు చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడంతా టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

ఢిల్లీలో మరో దారుణ ఘటన.. ప్రభుత్వ పాఠశాలలో ఆయుధాలతో ప్రవేశించిన దుండగుడు..
Government School
Follow us on

తూర్పు ఢిల్లీలోని కృష్ణ నగర్ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలోకి ఆయుధంతో ఓ అగంతకుడు ప్రవేశించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందిన వెంటనే పాఠశాలలో చదువుతున్న పలువురు చిన్నారుల బంధువులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇంతలో పోలీసులు ఆ దుండగుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కృష్ణా నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు పోలీసులు సాధారణ దుస్తుల్లో గస్తీ తిరుగుతున్నారు. ఈ క్రమంలో వారి కళ్లు నెంబర్ ప్లేట్ లేని బైక్ పై ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న బైక్ పై పడ్డాయి. దీంతో పోలీసులు వారిని ఆపి బైక్ తాళాలు తీసి ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఓ దుండగుడు పిస్టల్‌ తీసుకుని పోలీసులను చంపేస్తానని బెదిరిస్తూ పారిపోయాడు. పోలీసులు దుండగుల్లో ఒకరిని వెంబడించి పట్టుకోగా, మరో దుర్మార్గుడు పిస్టల్ తీసుకుని సమీపంలోని సర్వోదయ కన్యా విద్యాలయంలోకి గార్డును బెదిరిస్తూ ప్రవేశించాడు. దుర్మార్గుడు పాఠశాలలోకి ప్రవేశించిన వెంటనే, పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓతో సహా చాలా మంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాఠశాల, పరిసర ప్రాంతాలను సీజ్ చేసి దుండగుడిని పట్టుకున్నారు. దుండగుడు తన పిస్టల్‌ను పాఠశాల ఆవరణలోనే విసిరాడు. దానిని స్వాధీనం చేసుకున్నారు.

పాఠశాలలోని పిల్లలందరూ క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని షాహదారా జిల్లా డీసీపీ ఆర్ సత్య సుందరం తెలిపారు. దుండగులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండగులను మింటోరోడ్‌లో నివాసం ఉంటున్న ఇస్మాయిల్‌ (27), శాస్త్రి పార్క్‌ నివాసి ఇలియాస్‌ (24)గా గుర్తించారు. వీరిద్దరూ కిరాతక, నేర చరిత్ర ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి