రసగుల్లాలు ఎలా ఉంటాయని అడగగానే.. ఆ మాత్రం తెలియదా..? తెల్లని రంగులో, తియ్యటి రుచిలో ఉంటాయని చెప్పేద్దామనుకుంటున్నారా.. అయితే మీరు పొరపడినట్లే. రసగుల్లా అంటేనే నోరూరించే తియ్యని మిఠాయి. కానీ బిహార్‌లో మాత్రం ఇప్పుడు మిర్చి రసగుల్లా ప్రత్యక్షమైంది. అంతే కాదు.. దానికి రోజురోజుకు విశేష ఆదరణ పెరుగుతోంది. బిహార్ రాజధాని పట్నాలో మిర్చి రసగుల్లా పేరుతో తయారు చేస్తున్న వంటకం ఇప్పుడు వినియోగదారుల మన్నన పొందుతోంది. పట్నాలోని చట్కారా ఫుడ్ కోర్టు నిర్వాహకులు పచ్చిమిర్చితో చేసిన రసగుల్లాను తయారు చేశారు. ఈ రసగుల్లాలో కొంత తీపి కూడా కలిసినప్పటికీ మిర్చి ఘాటు ఎక్కువ ఉంటుంది. షుగర్ రోగులకు ఈ రసగుల్లా చాలా ఉపయోగకరంగా ఉంటుందని స్వీట్ షాప్ నిర్వాహకులు చెప్పారు. చాలా కాలంగా నాణ్యమైన తినుబండారాలు సరఫరా చేస్తున్నామని, వైవిధ్యమైన రుచులను కూడా అందిస్తున్నామని నిర్వాహకుడు చోటూ చెప్పారు. మిర్చి రసగుల్లా ఒక్కొక్కటి 15 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. పట్నా ప్రజలు ముందుగానే ఆర్డర్‌లు ఇచ్చిన మరీ కొంటున్నారని దుకాణదారులు చెబుతున్నారు.
ఇవీ చదవండి.
Narendra Modi : “ది కాశ్మీర్ ఫైల్స్” పై ప్రధాని మోడీ ప్రశంసలు.. ప్రతి ఒక్కరూ చూడాలని సూచన
Viral Photo: మీ కళ్లకు ఓ పరీక్ష.. ఇందులో ఏ జంతువు దాగుందో చెబితే మీరే జీనియస్!