మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు జారీ.. ఈ నెల 15న ఈడీ ఫ్రదాన కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులు

జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మరోసారి చిక్కుల్లో ఇరుక్కున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది.

మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు జారీ.. ఈ నెల 15న ఈడీ ఫ్రదాన కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులు
Follow us

|

Updated on: Mar 05, 2021 | 10:19 PM

Mehbooba Mufti issued Summons : జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మరోసారి చిక్కుల్లో ఇరుక్కున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కోసం ఈ నెల 15న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలంటూ నోటీసులు పంపింది.

ఈడీ అధికారులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం నమోదైన కేసులో ప్రశ్నించేందుకు మెహబూబా ముఫ్తీకి సమన్లు జారీ చేశారు. మార్చి 15న న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆమెను కోరారు. జమ్మూ-కశ్మీరును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత మెహబూబా ముఫ్తీ దాదాపు ఓ సంవత్సరంపాటు నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే.

అయితే, దీనిపై ముఫ్తీ స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. ‘‘భారత ప్రభుత్వం తన చర్యల ద్వారా ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తోంది. విపక్షాలు.. కేంద్రం పాలసీలను, విధానాలను ప్రశ్నించడం ప్రభుత్వానికి నచ్చడం లేదు. ఇలాంటి చర్యలతో భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోంది. కానీ ఇవేం పని చేయవు’’ అంటూ ముఫ్తీ ట్వీట్‌ చేశారు.

ఇదిలావుంటే, జమ్ముకశ్మీర్‌ పునర్విభజన నేపథ్యంలో ఏడాదికిపైగా గృహ నిర్బంధంలో ఉన్న మెహబూబా ముఫ్తీని గత ఏడాది విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు జమ్ముకశ్మీర్‌ ఏకీకరణ కోసం స్థానిక పార్టీలన్నీ కలిసి గుప్కార్‌ డిక్లరేషన్ కింద ప్రజల కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి అధ్యక్షుడు, జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి,ఎన్‌సీ అధినేత ఫరూఖ్ అబ్దుల్లాకు చెందిన రూ.12 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ గత ఏడాది జప్తు చేసింది. జమ్మూ-కశ్మీరు క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసింది. ఈ ఆరోపణలపై తాజాగా మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు జారీ చేసింది.

Read Also… తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు: కేవలం ఆరుగురితో అన్నాడీఎంకే తొలి జాబితా.. ఎడప్పాడి నుంచి సీఎం పళనిస్వామి పోటీ

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు