సైకో కిల్లర్.. అందంపై ద్వేషంతో కొడుకు సహా నలుగురిని చంపిన మహిళ అరెస్ట్‌‌.. విచారణలో షాకింగ్‌ విషయాలు

హర్యానాలోని పానిపట్‌లో అందమైన అమ్మాయిల పట్ల ద్వేషంతో ఓ మహిళ సైకో కిల్లర్‌గా మారింది. నలుగురు పిల్లలను, అనుమానం రాకుండా సొంత కొడుకును కూడా హత్య చేసింది. తాను అందంగా లేనని, తన కంటే ఎవరూ అందంగా ఎదగకూడదనే ఉద్దేశంతో ఈ దారుణాలకు పాల్పడింది. పోలీసుల విచారణలో ఆమె సైకో మనస్తత్వం బయటపడింది.

సైకో కిల్లర్.. అందంపై ద్వేషంతో కొడుకు సహా నలుగురిని చంపిన మహిళ అరెస్ట్‌‌.. విచారణలో షాకింగ్‌ విషయాలు
Haryana Psycho Killer

Updated on: Dec 03, 2025 | 8:59 PM

 

అందమైన అమ్మాయిల పట్ల ద్వేషంతో హంతకురాలిగా మారింది ఓ యువతి. మామూలు హంతకురాలు కాదు.. సైకో కిల్లర్‌ అవతారమెత్తింది. హర్యానాలో నలుగురు పిల్లలను చంపిన పానిపట్‌కు చెందిన సైకో కిల్లర్ మహిళ చేసిన దారుణాలు తెలిస్తే నమ్మడం కష్టం. కానీ, ఆమెను అరెస్టు చేసి విచారించిన తర్వాత పోలీసులు చెప్పిన విషయాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. ఆ మహిళ అందంగా కనిపించే అమ్మాయిలను లక్ష్యంగా చేసుకునేదని పానిపట్ ఎస్పీ భూపేంద్ర సింగ్ వివరాలు వెల్లడించారు. 2023లో కూడా ఈ మహిళ ఇద్దరు అమ్మాయిలను చంపింది. తరువాత, అనుమానం రాకుండా ఉండటానికి, ఆమె తన కొడుకును కూడా చంపింది. ఇప్పుడు నాల్గవ బిడ్డను చంపిన తర్వాత ఆమెను పట్టుకున్నారు. ఏ అమ్మాయి కూడా తన కంటే అందంగా ఎదగకూడదని ఆ మహిళ మనసులో ఉందని ఎస్పీ వివరించారు. అందుకే ఆమె అమ్మాయిలను చంపింది.

ఆ మహిళ అరెస్టు తర్వాత, పానిపట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) విచారణలో తాను వెల్లడించిన విషయాలను తెలియజేశారు. పోలీసుల ప్రకారం.. ఆమె అందమైన అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుంది. ఆమె తన బంధువులు, కుటుంబంలోని అమ్మాయిలను హత్య చేసేది. ఆమెకు సైకో కిల్లర్ మనస్తత్వం ఉంది. ఆమెకు అందమైన అమ్మాయిలంటే ద్వేషం. ఆమె తన సొంత కొడుకును కూడా హత్య చేసింది. మొదట, ఆమె ఇద్దరు అమ్మాయిలను చంపింది. తరువాత, అనుమానం రాకుండా ఉండటానికి, ఆమె తన కొడుకును కూడా చంపింది.

ఇవి కూడా చదవండి

హర్యానా సైకో కిల్లర్ ఎలా పట్టుబడింది..?

6 ఏళ్ల బాలిక నీటి తొట్టిలో మునిగి చనిపోయే అవకాశం లేకపోవడంతో అనుమానం వచ్చి ఆమెను పట్టుకున్నామని ఎస్పీ వివరించారు. రెండవ గేటు బయటి నుంచి లాక్ చేయబడింది. ఎవరో ఆ అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లి హత్య చేశారని స్పష్టంగా అర్థమైందని చెప్పారు. ఏ అందమైన అమ్మాయినైనా చూస్తే ఈ మహిళ పిచ్చెక్కినట్టుగా ప్రవర్తిసుందని చెప్పారు. పైగా ఆమె చాలా తెలివైనది. కానీ, అందమైన అమ్మాయిలంటే ఆమెకు చిరాకు కలిగిస్తుందట.

నాకంటే ఎవరూ అందంగా ఎదగకూడదు…

పానిపట్‌లోని భవద్ గ్రామానికి చెందిన నవీన్ భార్య పూనమ్ 2023లో తన వదిన కుమార్తెను, తన సొంత కొడుకును హత్య చేసిందని పానిపట్ ఎస్పీ భూపేంద్ర సింగ్ తెలిపారు. ఆగస్టు 2025లో ఆ మహిళ సివా గ్రామంలో కూడా ఒక బాలికను హత్య చేసిందని, ఇప్పుడు ఆమె 6 ఏళ్ల బాలికను హత్య చేసిందని, ఆ తర్వాత ఆమెను అరెస్టు చేశారని తెలిపారు. ఆమె తనకంటే ఎవరూ అందంగా ఉండకూడదు. ఎదగకూడదని ఆమె ఈ దారుణాలకు పాల్పడిందని పోలీసులు చెప్పారు. పట్టుబడకుండా ఉండటానికి, ఆమె తన సొంత కొడుకును కూడా చంపేసింది. ఆ మహిళకు ఇద్దరు కుమారులు ఉన్నారని, వారిలో ఒకరిని ఆమె హత్య చేసిందని పోలీసు సూపరింటెండెంట్ (SP) పేర్కొన్నారు. ఆ మహిళ పెద్దగా చదువుకోలేదని పోలీసు సూపరింటెండెంట్ (SP) వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..