Panchayat Polls In Himachal: ఓ వైపు కరోనా, మరోవైపు బర్డ్ ఫ్లూ.. హిమాచల్ ప్రదేశ్‌లో మోగిన స్థానిక ఎన్నికల నగారా

|

Jan 07, 2021 | 4:29 PM

హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల నగారా మ్రోగింది. తాజాగా పంచాయతీ రాజ్ సంస్థలకు సార్వత్రిక ఎలక్షన్స్ కు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది...

Panchayat Polls In Himachal: ఓ వైపు కరోనా, మరోవైపు బర్డ్ ఫ్లూ.. హిమాచల్ ప్రదేశ్‌లో మోగిన స్థానిక ఎన్నికల నగారా
Follow us on

Panchayat Polls In Himachal: హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల నగారా మ్రోగింది. తాజాగా పంచాయతీ రాజ్ సంస్థలకు ఎన్నికలకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయని తెలిపింది. జనవరి  17, 19 , 21 తేదీలలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.

ఎన్నికలు మూడు దశల్లో జరుగుతాయి, పంచాయతీ సమితి , జిలా పరిషత్ సభ్యుల ఓట్ల లెక్కింపు జనవరి 22 న నిర్వహించనున్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ జనవరి 23 లోగా పూర్తవుతుంది. ఓ వైపు కరోనా వైరస్, మరోవైపు బర్డ్ ఫ్లూ నేపధ్యంలో తగిన జాగ్రత్తలతో ఈ ఎన్నికలను నిర్వహించడానికి అధికారులు చర్యలు చేపట్టారు.

Also Read: ఢిల్లీ సరిహద్దులో భారీగా ట్రాక్టర్ ర్యాలీ, ఇది రిహార్సల్స్ మాత్రమే, 26 న మా తడాఖా చూపుతాం, రైతు సంఘాలు