PAN Aadhaar: మార్చి 31 వచ్చేస్తోంది.. ఈ పని చేయకపోతే వెంటనే చేసుకోండి.. గడువు ముగిసిందంటే ఇక అంతే..

|

Mar 24, 2021 | 2:10 PM

PAN Aadhaar: మార్చి 31వ తేదీ దగ్గరకు వచ్చేస్తోంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలో పలు అంశాలను అప్‌డేట్‌ చేసుకునేందుకు మార్చి..

PAN Aadhaar: మార్చి 31 వచ్చేస్తోంది.. ఈ పని చేయకపోతే వెంటనే చేసుకోండి.. గడువు ముగిసిందంటే ఇక అంతే..
Pan Aadhaar
Follow us on

PAN Aadhaar: మార్చి 31వ తేదీ దగ్గరకు వచ్చేస్తోంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలో పలు అంశాలను అప్‌డేట్‌ చేసుకునేందుకు మార్చి 31వ తేదీ గడువు ముగియనుంది. ఇక తాజాగా పాన్‌ కార్డును మీ ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు చివరి తేదీ మార్చి 31. అయితే ఇప్పటికీ మారు అనుసంధానం చేయకపోతే ఈనెలాఖరులో గా చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు తప్పవు. మీ బ్యాంకు లావాదేవీలన్నీ నిలిచిపోతాయి. అప్పుడు మీరే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మార్చి 31వ తేదీలోగా ఈ పని చేయకపోతే రూ.10వేల జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆధార్‌తో అనుసంధానించుకోవాల్సిందిగా సూచిస్తూ సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) గత ఏడాది ఫిబ్రవరి 13న నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనిని చివరి తేదీగా మార్చి 31, 2021 నిర్ణయించింది. ఈ లోపు ఈ రెండింటిని అనుసంధానించకపోయినట్లయితే ఏప్రిల్‌ 1, 2021 నుంచి ఆ పాన్‌ కార్డు ఉన్న వ్యక్తి దగ్గర నుంచి రూ. 10 వేల జరిమానా విధించే అవకాశం ఉంది.

పాన్‌కార్డులు చాలా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వాటిల్లో చాలా కీలకం. బ్యాంకు ఖాతా ప్రారంభించేందుకు, మ్యూచువల్‌ ఫండ్లు, షేర్‌లలో ఇది ఎంతో ముఖ్యం. అయితే రూ. 50 వేలకు మించి నగదు లావాదేవీల సమయంలోనూ పాన్‌ కార్డు తప్పనిసరి అవసరం. పాన్‌ చెట్లుబాటులో లేకపోతే ఇవన్నీ చేయడం సాధ్యం కాదు. పాన్‌, ఆధార్‌లను లింక్‌ చేయడం సులభమే. ఇన్‌కంట్యాక్స్‌ ఇఫైలింగ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటిపిని ఎంటర్‌ చేస్తే చాలు మీ పాన్‌కార్డు, ఆధార్‌ కార్డు లింకైపోయినట్లే.

అలాగే ఇంకో ప్రక్రియ ద్వారా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. మొబైల్‌ నెంబర్‌ నుంచి UIDAIPAN అని టైప్‌ చేసి 12 అంకెల ఆధార్‌ నెంబరు, స్పేస్‌ ఇచ్చి, పాన్‌ నెంబరును.. 567678 లేదా 56161 అనే నెంబర్లకు సందేశం పంపించాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఆధార్‌, పాన్‌ వివరాలన్నీ ఒకే విధంగా ఉండాలి. కాగా, ఇప్పటికే మీరు రెండింటిని జత చేసుకున్నా.. మరోసారి ఇఫైలింగ్‌ వెబ్‌సైట్‌లకి వెళ్లి చెక్‌ చేసుకోవడం మంచిది.

ఇవీ కూడా చదవండి :

PF Limits: ఉద్యోగులకు తీపి కబురు… తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో పీఎఫ్‌ జమ విషయంలో ఎంతో ఊరట..!

Price Hike: ఏప్రిల్‌ 1 నుంచి బాదుడే.. బాదుడు.. వీటి ధరలు భారీగా పెరగనున్నాయి…కొనాలంటే ఇప్పుడే కొనేయండి..!

Premiums Increase: ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీలపై ఎలాంటి మార్పులు చేయరాదు.. సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం

FD Insurance: మీరు బ్యాంకులో డబ్బులు డిపాజిట్‌ చేస్తున్నారా..? దానిపై అధిక ఇన్సూరెన్స్‌ పొందాలంటే ఏం చేయాలి..?