యుద్ధం చేతకాక.. ఫేక్ వీడియోలతో విరుచుకుపడుతున్న పాకిస్థాన్! ఈ లిస్ట్ అంతా అబద్ధపు ప్రచారాలే..
పాకిస్థాన్ భారతదేశంపై డ్రోన్లు, క్షిపణుల దాడులు చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తోంది. S400 యాంటీ మిస్సైల్ సిస్టమ్‌ను ధ్వంసం చేసినట్లు, భారత విద్యుత్ గ్రిడ్‌ను దెబ్బతీసినట్లు, ఎయిర్ ఫోర్స్ జెట్లను కూల్చినట్లు, భారత పైలట్లను పట్టుకున్నట్లు ఫేక్ వీడియోలు, పోస్టులను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తోంది. అయితే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ తప్పుడు ప్రచారాన్ని తోసిపుచ్చి, నిజాలను బయటపెడుతోంది.

ఇండియా దాడులను తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్.. డ్రోన్లు, క్షిపణుల దాడులతో పాటు ఫేక్ ప్రచారం కూడా మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు, నకిలీ పోస్టులు, పాత వీడియోలతో పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది. భారత్‌పై దాడులు చేశామంటూ పాత వీడియోలను పోస్ట్ చేస్తూ అంతర్జాతీయంగా పరువుపోగొట్టుకుంటోంది. అయితే పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఎప్పటికప్పుడు ఎండగడుతోంది. ఆధారాలతో సహా పాక్ ఫేక్ ప్రచారాన్ని బయటపెడుతోంది. పాక్ కంటెంట్‌పై భారత్‌లో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
భారతదేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై మిస్సైల్ తో దాడి చేసినట్లు కూడా పాకిస్థాన్ ఫేక్ వీడియో ప్రచారం చేస్తోంది. దాన్ని కూడా పీఐబీ ఫేక్ అని తేల్చేసింది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పై ఎలాంటి మిస్సైల్ దాడి జరగలేదని స్పష్టం చేసింది.
🚨 Missile Attack on Delhi Airport?
An old video is being falsely shared as footage of a missile strike on New Delhi Airport.#PIBFactCheck
❌ This video shows a gas station explosion in Aden, Yemen, from August 2024.
✅ It has no connection to the current India–Pakistan… pic.twitter.com/pFqfDO50nm
— PIB Fact Check (@PIBFactCheck) May 10, 2025
S 400.. భారత్ అమ్ములపొదిలో సుదర్శన చక్రం ఇది. పాకిస్తాన్ విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న డ్రోన్లు, మిసైళ్లను గాల్లోనే కూల్చేస్తున్న పాశుపతాస్త్రం ఇది. యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తోంది. యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులను.. అత్యంత కచ్చితత్వంతో నేలకూల్చగలదు ఈ S400. ఒకేసారి 300 లక్ష్యాలపై కన్నేసి ఉంచడంతోపాటు.. ఏకకాలంలో 36 టార్గెట్స్‌ను ధ్వంసం చేయగలదు. అలాంటి.. S400ని ధ్వంసం చేసేసినట్టు తప్పుడు ప్రచారానికి దిగింది పాకిస్తాన్. ఇండియన్ యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ S400ను కూల్చేసినట్టు ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేస్తోంది. అయితే, ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేసింది పీఐబీ. S400కి ఏమీకాలేదని, సమర్ధవంతంగా పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లను నేలకూల్చుతోందని ప్రకటించింది.
🚨 S-400 Destroyed by Pakistan? Here’s the Truth!
Posts circulating on social media claim that Pakistan has destroyed an Indian S-400 air defence system.#PIBFactCheck
❌ This claim is FAKE.
❌ Reports of destruction or any damage to an S-400 system are baseless.… pic.twitter.com/wPLKQSBAqe
— PIB Fact Check (@PIBFactCheck) May 10, 2025
ఇలాంటిదే మరో ఫేక్ ప్రచారం చేసింది. దేశాభివృద్ధిలో అత్యంత కీలకమైన ఇండియన్ ఎలక్ట్రికల్ గ్రిడ్ కుప్పుకూలిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది పాకిస్తాన్. 70 శాతం ఎలక్ట్రికల్ గ్రిడ్ పనిచేయడం లేదంటూ ఫేక్ పోస్ట్ పెట్టింది. ఇది అవాస్తవమంటూ క్లారిటీ ఇచ్చింది పీఐబీ. భారత్‌లో విద్యుత్ వ్యవస్థ, ఎలక్ట్రికల్ గ్రిడ్ పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తున్నట్టు తెలిపింది.
🚨 Attention: False Claim Circulating Online! 🚨
Social media posts are asserting that a cyber attack by #Pakistan has caused 70% of India’s electricity grid to become dysfunctional.#PIBFactCheck
❌This claim is #FAKE#IndiaFightsPropaganda pic.twitter.com/8Gcmcm4vYq
— PIB Fact Check (@PIBFactCheck) May 10, 2025
హిమాలయన్ రీజియన్‌లో మూడు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ జెట్స్‌ను కూల్చేసినట్టుగా మరో తప్పుడు ప్రచారానికి దిగింది పాకిస్తాన్. ఇది కూడా ఫేక్ వీడియో అని తేల్చింది పీఐబీ. ఇప్పటివరకు ఒక్క ఫైటర్ జెట్‌ని కూడా కోల్పోలేదని ప్రకటించింది.
🚨Did 3 IAF Jets Crash in Himalayas? 🚨
Several pro-Pakistan social media accounts are falsely claiming that three fighter jets have crashed in different areas of the Himalayan region.#PIBFactcheck
– This claim is #FAKE
– The image being circulated is old, dating back to… pic.twitter.com/WZ9cBLWXWI
— PIB Fact Check (@PIBFactCheck) May 10, 2025
పాకిస్తాన్ ఆర్మీకి.. ఇండియన్ లేడీ పైలట్ పట్టుబడినట్టు ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేస్తోంది పాకిస్తాన్. ఐఏఎఫ్ ఫైటర్ జెట్ నుంచి పైలట్ శివానీ సింగ్, పాక్ భూభాగంలో దూకేసినట్టు.. ఆమెను సజీవంగా పట్టుకున్నట్టుగా ప్రచారం చేస్తోంది. అయితే, ఇదంతా ఫేక్ అని చెప్పింది పీఐబీ.
Indian Female Air Force pilot has NOT been captured🚨
Pro-Pakistan social media handles claim that an Indian Female Air Force pilot, Squadron Leader Shivani Singh, has been captured in Pakistan.#PIBFactCheck
❌ This claim is FAKE!#IndiaFightsPropaganda@MIB_India… pic.twitter.com/V8zovpSRYk
— PIB Fact Check (@PIBFactCheck) May 10, 2025
ఇలాంటిదే మరో ఫేక్ వీడియో ఇది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కోట్లీలో యుద్ధ విమానం నుంచి భారతీయ పైలట్ దూకినట్టుగా తప్పుడు ప్రచారానికి దిగింది. ఇది కూడా ఫేక్‌గా ప్రకటించింది పీఐబీ.
🚨 Indian Pilot Ejected Over PoK? Here’s the Truth!
Posts on social media claim that an Indian pilot ejected from a fighter jet over Pakistan-occupied Kashmir (PoK).#PIBFactCheck
❌ This claim is FAKE.
📢 Don’t fall for misinformation. Always verify before sharing.… pic.twitter.com/u12T92qhr2
— PIB Fact Check (@PIBFactCheck) May 10, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..