పాక్‌ వక్రబుద్ది.. మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు..

శుక్రవారం నాడు జమ్ముకశ్మీర్‌ సరిహద్దులోని బారాముల్లా జిల్లాలోని రాంపూర్ సెక్టార్‌ మీదుగా కాల్పులకు తెగబడింది. మోర్టార్ షెల్స్‌ ఉపయోగిస్తూ.. పాక్ సైన్యం కాల్పులకు దిగిందని పోలీసులు తెలిపారు.

పాక్‌ వక్రబుద్ది.. మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు..

Edited By:

Updated on: Jun 12, 2020 | 8:27 PM

పాక్ తన వక్రబుద్దిని మరోసారి ప్రదర్శిస్తోంది. గురువారం రాత్రి.. పాకిస్థాన్‌ సైన్యానికి బుద్ది వచ్చేలా పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. మళ్లీ శుక్రవారం నాడు జమ్ముకశ్మీర్‌ సరిహద్దులోని బారాముల్లా జిల్లాలోని రాంపూర్ సెక్టార్‌ మీదుగా కాల్పులకు తెగబడింది. మోర్టార్ షెల్స్‌ ఉపయోగిస్తూ.. పాక్ సైన్యం కాల్పులకు దిగిందని పోలీసులు తెలిపారు. పాక్‌కు ధీటుగా.. భారత సైన్యం కూడా జవాబిచ్చిందని పోలీసులు తెలిపారు. గత కొద్ది రోజులుగా నిత్యం పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. సరిహద్దుల వద్ద కాల్పులకు దిగుతోంది. ఈ క్రమంలో ఇటీవల ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. గురువారం రాత్రి భారత సైన్యం జరిపిన దాడిలో దాదాపు 10కి పైగా పాక్‌కు చెందిన ఔట్‌ పోస్టులు ధ్వంసమయ్యాయి.