Geeta Finally Finds Her Mom: గీతా అన్వేషణ ఫలించింది.. తల్లి చెంతకు చేరింది.. ఇక ఆ ఒక్కటే మిగిలివుంది..

Return to India From Pakistan: గీతా అన్వేషణ ఫలించింది. 9 ఏళ్ల వయసులో తప్పిపోయి పాకిస్తాన్‌కు చేరిన గీత.. తన తల్లి దగ్గరకు చేరబోతోంది. మహారాష్ట్రకు చెందిన 71 ఏళ్ల మీనా..

Geeta Finally Finds Her Mom: గీతా అన్వేషణ ఫలించింది.. తల్లి చెంతకు చేరింది.. ఇక ఆ ఒక్కటే మిగిలివుంది..

Updated on: Mar 12, 2021 | 11:33 AM

Geeta Finds her Birth Mother: గీతా అన్వేషణ ఫలించింది. 9 ఏళ్ల వయసులో తప్పిపోయి పాకిస్తాన్‌కు చేరిన గీత.. తన తల్లి దగ్గరకు చేరబోతోంది. మహారాష్ట్రకు చెందిన 71 ఏళ్ల మీనా.. గీత తల్లిగా నిర్ధారణ అయింది. ఈ మేరకు గీత ఆశ్రయం పొందుతున్న స్వచ్ఛంద సంస్థ ఆనంద్‌ సర్వీస్‌ సొసైటీ.. ఓ ప్రకటన చేసింది.

గీత గురించి మీనా వాకబు చేసిన సమయంలో.. ఎన్జీవో అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగారు. తన కుమార్తె పొట్టపై కాలిన గాయం మరక ఉంటుందని చెప్పడంతో అది నిజమని తేలింది. దీంతో ఆమే తల్లిగా దాదాపు నిర్ధారించుకున్నప్పటికీ.. ఇంకా డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించలేదు. ఆ పరీక్షలు కూడా నిర్వహించేందుకు అధికారులు సిద్దమయ్యారు.

గీత అసలు పేరు రాధ. పర్భనీ జిల్లాలోని జింతూరులో మీనా కుటుంబం ఉండేది. గీత తండ్రి సుధాకర్‌ కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. తర్వాత మీనా రెండో పెళ్లి చేసుకుని ఔరంగాబాద్‌లో ఉంటోంది. గీతకు చెవులు వినపడవు, మాటలు రావు. ప్రస్తుతం ఆమె వయసు 29 ఏళ్లు. 2015లో అప్పటి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ చొరవతో గీతా.. భారత్‌కు చేరింది. అప్పటి నుంచి ఆమె తల్లి కోసం వెతుకుతూ ఉండగా.. నేడు ఓ కొలిక్కి వచ్చింది.

గీత తమ కుమార్తె అంటే తమ కుమార్తే అంటూ దాదాపు 40 కుటుంబాలు ముందుకొచ్చాయి. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఢిల్లీ, బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన పలువురు ఆమె తమ కుటుంబసభ్యురాలేనని చెప్పడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. చివరకు గీతా కుటుంబసభ్యుల ఆచూకీ మహారాష్ట్రలో ఉన్నట్టు తెలవడంతో ఈ కేసుకు ఫుల్‌స్టాప్‌ పడినట్టు అయింది.

ఇవి కూడా చదవండి

Gunathilaka Out or not?: లంక, విండీస్ వన్డేలో వివాదం.. బంతిని కాళ్లతో తన్నాడని బ్యాట్స్‌మెన్ గుణతిలక ఔట్..!

India vs England: టీ 20 సిరీస్ ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని గంటలకో తెలుసా..! అయితే లైవ్ ఇలా చూడండి..!

Vijay Hazare Trophy: పాకిస్తాన్‌పై కోహ్లీ చేసిన రికార్డుకు బ్రేక్ పడింది.. పరుగుల వరద పారించిన షా..