Narendra Modi: ప్రధాని మోదీని వేనోళ్ల పొగుడుతున్న పాక్ మీడియా.. ఇమ్రాన్ బాటలోనే అక్కడి వార్తాసంస్థలు..? వివరాలివే..

|

Jan 16, 2023 | 1:55 PM

ఎప్పుడూ భారత్‌పై విషం కక్కుతూ, భారత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసే పాక్ మీడియా ఉన్నంట్లుండి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. పాకిస్థాన్‌లో విదేశీ మారక నిల్వలు ఆవిరైపోతూ ధరలు ఆకాశానికి..

Narendra Modi: ప్రధాని మోదీని వేనోళ్ల పొగుడుతున్న పాక్ మీడియా.. ఇమ్రాన్ బాటలోనే అక్కడి వార్తాసంస్థలు..? వివరాలివే..
Pak Media Praises Pm Modi
Follow us on

ఎప్పుడూ భారత్‌పై విషం కక్కుతూ, భారత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసే పాక్ మీడియా ఉన్నంట్లుండి భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. పాకిస్థాన్‌లో విదేశీ మారక నిల్వలు ఆవిరైపోతూ ధరలు ఆకాశానికి అంటి ప్రజలు ఆకలితో అలమటిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ మీడియా వైఖరి సర్వత్రా కలకలం రేపుతోంది. పాక్ ప్రజలు నానా యాతనలు పడుతూ గోధుమ పిండి కోసం కూడా భారీ క్యూలు, తొక్కిసలాటలు జరిగి సామాన్యులు చచ్చిపోతున్న వేళ ఆ దేశ మీడియా మోదీ ఆర్ధిక విధానాలను, విదేశాంగ నీతిని ప్రశంసిస్తోంది. ఈ క్రమంలోనే పాక్‌లో నెలకొన్న పరిస్థితులను ఉద్దేశిస్తూ.. ఆ దేశం అవలంబిస్తున్న ఆర్ధిక విధానాలను, విదేశాంగ నీతిపై విరుచుకుపడింది అక్కడి మీడియా. ఈ క్రమంలోనే భారత్ అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలను, విదేశాంగ నీతిని ప్రశంసించింది. అంతేకాక, మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకుంటోందని పాకిస్థాన్ దిన పత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తాజాగా కీర్తించింది.

ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ కథనంలో ఏముందంటే..

భారత ప్రతిష్టను మోదీ పెంచుకుంటూ పోతున్నారంటూ షహజాద్ చౌధరీ అనే రాజకీయ, భద్రత, రక్షణ విశ్లేషకుడు రాసిన కథనాన్ని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ప్రచురించింది. మోదీ తన నైపుణ్యంతో భారత జీడీపీ 3 ట్రిలియన్ డాలర్లకు పెంచారని ట్రిబ్యూన్ కథనంలో షహజాద్ చౌధరీ ప్రస్తావించారు. మోదీ విదేశాంగ విధానాలు అబ్బురపరుస్తున్నాయని, వ్యవసాయ ఉత్పత్తులు రికార్డు స్థాయిలో అత్యుత్తమ స్థాయికి పెరిగాయని, ఐటీ పరిశ్రమ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో విస్తరించిందని చౌధరీ రాసుకొచ్చారు. కాల పరీక్షకు తట్టుకుని భారత ప్రజాస్వామ్యం దృఢంగా నిలిచిందని షహజాద్ చౌధరి మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. మోదీ స్వయంగా భారత్‌కు బ్రాండ్ తీసుకువచ్చేందుకు నడుంకట్టి విజయవంతమయ్యారని తన కథనంలో రాశారు షహజాద్ చౌధరీ.

పాక్ మాజీ ప్రధాని బాటలోనే షహజాద్..

షహజాద్ చౌధరీ కంటే ముందు పాక్ మాజీ ప్రధానమంత్రి, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కూడా సమయం దొరకడమే అదను అన్న మాదిరిగా నరేంద్రమోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాలను ప్రశంసిస్తూ ఉన్నారు. భారత విదేశాంగ విధానం స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరిస్తుందని మెచ్చుకున్న ఇమ్రాన్ బాటలోనే ఇప్పుడు షహజాద్ చౌధరీ కూడా నడిచారు. అమెరికా తదితర దేశాల నుంచి వ్యతిరేకత వచ్చినా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడాన్ని ఇమ్రాన్ చాలాసార్లు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే మోదీని, మోదీ ప్రభుత్వాన్ని కీర్తించారు.

ఇవి కూడా చదవండి

కాగా, పాక్ మీడియా గతంలో నరేంద్ర మోదీ విధానాలను తీవ్రంగా విమర్శించడమే కాక విష ప్రచారం చేసిన సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. గోద్రా నుంచి మొదలుకుని ఆర్టికల్ 370 రద్దు వరకూ అన్ని నిర్ణయాలలోనూ భారత విధివిధానాలను పాక్ మీడియా తప్పుబట్టేది. కానీ అదే పాక్ మీడియా ఇప్పుడు మోదీ నాయకత్వాన్ని, ప్రపంచంలో మన దేశ స్థాయి గురించి పేర్కొనడమే కాక ప్రశసించడంతో.. భారత్ సహా అనేక దేశాలు నమ్మలేకపోతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..